నల్గొండ: మహిళలపై మృగాళ్లు యథేచ్ఛగా ఆకృత్యాలకు పాల్పడుతున్న ఘటనలు రోజూ ఏదో మూలన చోటు చేసుకుంటునే ఉన్నాయి. తాజాగా యువతి ప్రేమకు నిరాకరించిందని ఓ యువకుడు కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన జిల్లాలోని ప్రకాశం బజార్ లో కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా సైదుల్ అనే యువకుడు బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న యువతి వెంటబడుతూ ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. మంగళవారం కూడా తిరిగి ప్రేమ ప్రస్తావన తీసుకురావడంతో యువతి తిరస్కరించింది. ఈ క్రమంలో అతను స్నేహితులతో కలిసి ఆమెపై కిరోసిన్ తో దాడికి పాల్పడ్డాడు. తొంభై శాతం కాలిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్ ఆ యువతి పరిస్థితి విషమంగా ఉంది.