సాక్షి, రాయదుర్గం(అనంతపురం) : తన ప్రియమైన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం మొఘల్ చక్రవర్తి షాజహాన్ తాజ్‌మహల్ నిర్మించాడు. ఈ కట్టడ నిర్మాణం 1632లో మొదలై 1653లో పూర్తయింది. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న గిరిజన యువతి భాగ్యమతి కోసం ఏకంగా భాగ్యనగరాన్నే నిర్మించాడు షాహీ సుల్తాన్ కులీ కుతుబ్ షా. సుందరమైన ఈ నగరం 1590లో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఇలాంటి చారిత్రక ఆధారమే జిల్లాలోనూ ఉంది. క్రీ.శ 18వ శతాబ్దంలో రాయదుర్గంలో సతీసహగమనంలో భాగంగా కోనేటి నాయకుని భార్య వెంకటలక్షుమమ్మ ఆత్మార్పణం చేసుకుంది. ఆమె జ్ఞాపకార్థం ఓ సమాధి నిర్మించారు. ప్రస్తుతం అది రాయదుర్గంలోని మధు టాకీస్ సమీపంలో ఉన్న ఓ తోటలో ఉంది. ఇది చదవండి : పురాతన ఆలయం.. సౌమ్యనాథ క్షేత్రం
Comments
Please login to add a commentAdd a comment