
తప్పిపోయిన చిన్నారిని పట్టుకున్న పోలీస్ సిబ్బంది
విజయవాడ : పోలీస్ వాట్సాప్ నంబర్‌కు అందిన సమాచారంతో తప్పిపోయిన 4 ఏళ్ల బాలిక ఆచూకీని నగర పోలీసులు కనుగొన్నారు. ఆ చిన్నారిని 20 నిమిషాల్లో క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా నుంచి రమణారెడ్డి తన భార్య, 4 ఏళ్ల చిన్నారితో కలిసి సోమవారం విజయవాడ ప్రకాష్‌నగర్ పైపుల రోడ్డులో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరయ్యారు. కార్యక్రమం హడావిడిలో నాలుగేళ్ల చిన్నారి అరుణ ఇంటి బయటకు వచ్చి దారి తెలియక తప్పిపోయింది.
కొద్దిసేపటికి గుర్తుకు వచ్చిన రమణారెడ్డి తన కుమార్తె అరుణ కోసం వెతకటం ప్రారంభించారు. ఆమె కనపడలేదు. దాంతో విజయవాడ పోలీస్ వాట్సాప్ నెం.70289 09090 కు మెసేజ్ ద్వారా సమాచారం ఇచ్చారు. వాట్సాప్ సమాచారంతో అప్రమత్తమైన నగర పోలీసులు వైర్‌లెస్ సెట్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకు, రక్షక్, బ్లూకోట్స్‌లకు సమాచారం అందించారు. ఈ క్రమంలో నున్న రక్షక్ మొబైల్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది అక్కడి స్థానికుల సహాయంతో చిన్నారిని కనుగొన్నారు. ఇరవై నిమిషాల వ్యవధిలోనే చిన్నారిని తల్లితండ్రులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment