కృష్ణా జలాల ఘనత వైఎస్‌దే
అనంతపురం అగ్రికల్చర్: అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి ద్వారా కరువు జిల్లా ‘అనంత’కు కృష్ణా జలాలు తీసుకువచ్చిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కె.వెంకటచౌదరి అన్నా రు. ఈ రోజు పీఏబీఆర్ కుడికాలువ ద్వారా చెరువుల్లోకి కృష్ణా జలాలు చేరుతున్నాయంటే అది వైఎస్ చలవేనన్నా రు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ నాయకులు గురువారం స్థానిక సుభాష్‌రోడ్డులో ఉన్న దివంగత నేత వైఎస్‌ఆర్ విగ్రహానికి కృష్ణమ్మజలాలతో జలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆలమూరు శ్రీనివాసరెడ్డి, కె.వెంకటచౌదరి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, ట్రేడ్ యూ నియన్ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, సాంస్కృతిక విభా గం జిల్లా అధ్యక్షుడు రిలాక్స్‌నాగరాజు, సేవాదల్ జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోభిలేసు తదితరులు మాట్లాడారు. వెనుకబడిన ‘అనంత’ను సస్యశ్యామలం చేసి రైతులను గట్టెక్కించాలనే సమున్నత ఆశయంతో జలయజ్ఞంలో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టుకు 857 అడుగులు ఎత్తులో ఉన్న జిల్లాకు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా నీటిని తీసుకురావడానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.4,294 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు.
ఎనిమిది లిఫ్టులతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన ఆయన.. జిల్లా ప్రజలు, రైతులకు సాగు, తాగునీటిని అందించారన్నారు. ఇందుకోసం పైసా ఖర్చు చేయని తెలుగుదేశం పార్టీ నేతలు చెరువులకు పీఏబీఆర్ కుడికాలువ ద్వారా నీరు అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం 1996 మార్చి 11న ఉరవకొండ వద్ద, 1999 జూలై 9న ఆత్మకూరు సమీపంలో రెండు సార్లు కేవలం శిలాఫలకాలు ఆవిష్కరించి చేతులు దులుపుకున్నారని గుర్తు చేశారు.
కనీసం గంపెడు మట్టి ఎత్తకుండా ఒక అడుగు కాలువ కూడా తీసిన దాఖలాలు లేవన్నారు. అంతేకాకుండా 40 టీఎంసీల సాగునీటి ప్రాజెక్టును 5 టీఎంసీల సాగునీటి ప్రాజెక్టుగా మార్పు చేసే ప్రయత్నం చేసిన చంద్రబాబునాయుడు రైతుద్రోహి అన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ను తానే పూర్తి చేసినట్లు తామే జిల్లాకు నీరు అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు డాంబికాలకు పోతున్నారని దుయ్యబట్టారు. వైఎస్ మరణం తరువాత 90 శాతం పూర్తయిన ప్రాజెక్టు పనులు ఎక్కడిక్కడ ఆగిపోయాయన్నారు.
జిల్లా అభివృద్ధిపై చిత్తశుద్ధి వుంటే ఇప్పటికైనా హంద్రీ-నీవాకు నిధులు విడుదల చేసి పూర్తీ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ‘వైఎస్‌ఆర్ అమర్ రహే... జగన్ నాయకత్వం వర్థిల్లాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ మైనుద్ధీన్, కసనూరు రఘునాథ్‌రెడ్డి, పాలే జయరామ్‌నాయక్, గుర్రం శ్రీనివాసులరెడ్డి, గౌస్‌బేగ్, సీసీ రేవు శంకర్‌రెడ్డి, కుమ్మర ఓబులేసు, కె.విద్యాసాగర్‌రెడ్డి, ముష్టూరు నరసింహారెడ్డి, కేవీ మారుతీప్రకాష్, సురేష్‌రెడ్డి, జేఎం బాషా, శివనాగరాజు, మహబూబ్‌పీరా, ఎస్టేట్ వెంకటరెడ్డి, లోకనాథ్‌రెడ్డి, నారపరెడ్డి, రుద్రంపేట కృష్ణవేణి, మార్కెట్‌శివ, డీకే రామలింగం, మారేష్, రాజగోపాల్, షరీఫ్, గంగులప్ప, వాయ ల శ్రీనివాసులు, ప్రభాకరరెడ్డి, కృష్ణమూర్తి, వడ్డేశీనా పాల్గొన్నారు.