credited
-
ఖాతాల్లోకి రూ.820 కోట్లు - ఆనందపడేలోపే..
గతంలో అనుకోకుండా కొంతమంది సామాన్యుల బ్యాంక్ ఖాతాల్లోకి కోట్ల రూపాయలు జమయిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి మరో సంఘటన మళ్ళీ జరిగినట్లు సోషల్ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యూకో బ్యాంక్ కస్టమర్లకు ఇటీవల ఒక పెద్ద జాక్‌పాట్ తగిలి.. అంతలోనే మిస్ అయిపోయింది. యూకో బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల్లోకి ఏకంగా 820 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అమౌంట్ డిపాజిట్ అయినట్లు వారి మొబైల్ నెంబర్లకు మెసేజ్‌లు కూడా వచ్చాయి. ఒక్కసారిగా లెక్కకు మించిన డబ్బు ఖాతలోకి రావడంతో కొందరు ఉబ్బితబ్బిబ్బయ్యారు. వెంటనే తేరుకున్న బ్యాంక్ జరిగిన పొరపాటుని గుర్తించి.. డబ్బు డిపాజిట్ అయిన బ్యాంక్ ఖాతాల లావాదేవీలను బ్లాక్ చేసింది. అంత కాకుండా ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) కూడా నిలిపివేసింది. ఇదీ చదవండి: దీపావళికి నెట్లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్ ఈ నెల 10, 13 తేదీల్లో జరిగిన కొన్ని సాంకేతిక లోపాల కారణంగా అమౌంట్ పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ అయినట్లు బ్యాంక్ వెల్లడించింది. అయితే ఇప్పటికే 79 శాతం (సుమారు రూ. 649 కోట్లు) రికవరీ చేసినట్లు వెల్లడించింది. ఇంకా రావాల్సిన మొత్తం రూ. 171 కోట్లు. ఈ డబ్బు మొత్తం రికవరీ అవుతుందా? లేదా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. -
కొత్త స్కాం వెలుగులోకి: సొమ్ము గోవిందా! లబోదిబోమంటున్న నగల వ్యాపారులు
‘మీ అకౌంట్లో డబ్బు పడింది’ అంటూ జ్యూయల్లరీ వ్యాపారులను దోచేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇలా ఒక్కరు ఇద్దరుకాదు చాలామంది నగల వ్యాపారులు ఇలాంటి మోసానికి బలైనట్టు తెలుస్తోంది. ఎన్డీటీవీ అందించిన కథనంలోని వి వరాలను పరిశీలస్తే నగలవ్యాపారి నావల్ కిషోర్ ఖండేల్వాల్ ఢిల్లీలో అతిపెద్ద బంగారం, వెండి మార్కెట్లో ఐదు దశాబ్దాల నాటి దుకాణాన్ని నడుపుతున్నారు. గత వారం అయోధ్యకు వెళ్లారు. అక్కడ ఉండగానే ఒక వ్యక్తి ఫోన్లో సంప్రదించి, 15 గ్రాముల బంగారు గొలుసు కొనుగోలుకు కొడుకులతో డీల్ కుదుర్చుకున్నానని చెప్పాడు. తాను దుకాణాన్ని సందర్శించ లేనని ఆన్లైన్లోనే డబ్బులు చెల్లిస్తానంటూ ఖండేల్వాల్ని నమ్మించాడు. ఇంటర్నెట్-బ్యాంకింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వెంటనే తన బ్యాంక్ ఖాతాలో రూ. 93,400 జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో అతను తన కుమారులకు స్క్రీన్‌షాట్ పంపాడు. దీంతో పేమెంట్ అయినట్టుగా భావించిన వారు ఆ వ్యక్తి ఇచ్చిన చిరునామాకు బంగారు గొలుసును పంపించారు. ఇదే ప్లాన్‌ను పక్కగా మరోసారి అమలు చేశారు కేటుగాళ్లు. దీంతో మరుసటి రోజు అదే వ్యక్తి ఫోన్ చేసి తనకు 30 గ్రాముల బంగారు గొలుసు కావాలని చెప్పాడు. సేమ్ సీన్ రిపీట్ అయింది. ఖండేల్వాల్కి రూ.1,95,400 తన ఖాతాలో జమ చేసినట్లు ఎస్ఎంఎస్ రావడం, ఆ గోల్డ్ చెయిన్‌ను అతనికి పంపడం జరిగిపోయింది. ఆ తరువాత తీరిగ్గా నగల వ్యాపారి బ్యాంక్ మొబైల్ యాప్‌లో అకౌంట్ చెక్ చేసుకొని డబ్బు జమ కాలేదని గ్రహించాడు. అపుడు తనకు వచ్చిన మెసేజ్ అచ్చం బ్యాంకు ఫార్మాట్లో ఉన్న ఫేక్ మేసేజ్ అని తెలుసుకుని లబోదిబోమన్నాడు. మరోవైపు ఇందులో తమ బాధ్యత ఏమీ లేదని, తామేం చేయలేమని బ్యాంకు అధికారులు తెలిపారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు నేరగాళ్లు ఎవరు అనేది కనుగొనలేక పోయారు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇతనితో పాటు దేశంలో పలు చోట్ల పలువురు వ్యాపారులు కూడా ఇలాంటి మోసానికి బలైయ్యారనేది తమ దృష్టికి వచ్చిందని బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యోగేష్ సింఘాల్ తెలిపారు. అయితే బ్యాంక్ పోర్టల్ లేదా ఏదైనా వెబ్ పోర్టల్ ఉపయోగించలేదు కాబట్టి ఈ మోసం సైబర్ చట్టం కిందకు రాదని ఇది మోసం, ఫోర్జరీకి సంబంధించిన విషయం కాబట్టి క్రిమినల్ యాక్ట్ కిందికి వస్తుందని సైబర్ లా నిపుణుడు సజల్ ధమిజా అన్నారు. -
4వ తేదీ నుంచి జన్‌ధన్ ఖాతాల్లో నగదు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ మహిళా ఖాతాదారులకు రెండో విడత ఆర్థిక సాయం రూ. 500 ఈనెల 4వ తేదీ నుంచి విడుదల చేయనుంది. నిర్దేశించిన తేదీల్లో నగదు వారి ఖాతాల్లో జమ కానున్నట్లు ఎస్ఎల్బీసీ (రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి) శనివారం ప్రకటించింది. ఖాతా నంబరు చివరి అంకె ఆధారంగా షెడ్యూల్ ఇచ్చామని, లబ్ధిదారులు ఆయా తేదీ ల్లో సంబంధిత బ్యాంకులు, ఏటీఎం, బ్యాంకు మిత్ర, బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా నగదును తీసుకోవచ్చని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఇచ్చే రూ.1,500 ఆర్థిక సాయం కూడా వారి ఖాతాల్లో ఈనెల 2వ తేదీ నుంచి జమ కానున్నాయి. ఈ నిధులను కూడా నిర్దేశించిన షెడ్యూల్ ఆధారంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ నగదు ఉపసంహరణ చేసుకోవాలని ఎస్ఎల్బీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 12వ తేదీ తర్వాత సీరియల్ నంబర్‌తో సంబంధం లేకుండా అందరూ విత్‌డ్రా చేసుకోవచ్చని, జన్‌ధన్ అకౌంట్ లేదా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో ఒకసారి జమ అయిన నిధులను ప్రభుత్వం తిరిగి వెనక్కు తీసుకోదని స్పష్టం చేసింది. చదవండి: వడివడిగా ‘కొండపోచమ్మ’ చెంతకు -
పాపం.. పండుటాకులు
కొవ్వూరు : వయోభారంతో కదలలేని స్థితిలో ఉన్న పండుటాకులను కష్టాలు వెంటాడుతున్నాయి. పింఛను సొమ్ముల కోసం మూడు రోజుల నుంచి సహాయకులను వెంటబెట్టకుని.. చేతికర్ర సాయంతో కాళ్లీడ్చుకుంటూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. బ్యాంకుల ఎదుట గంటల తరబడి క్యూలో నిలబడి కౌంటర్ వద్దకు వెళితే.. మీ అకౌంట్లో సొమ్ము రాలేదనే సమాధానం వస్తోంది. వికలాంగులు, వితంతువుల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపు కాదు. జిల్లా వ్యాప్తంగా 3,38,153 మందికి ప్రభుత్వం సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఇందులో సుమారు 2లవేల మంది ఖాతాల్లో సొమ్ము జమకాలేదు. కొందరికి బ్యాం క్ ఖాతాలు లేకపోవడం.. ఖాతాలున్నా వినియోగించకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. శనివారం నాటికి కొన్ని ఖాతాలను సరిచేసినప్పటికీ ఇంకా 15,251 మందికి పింఛను సొమ్ము ఖాతాల్లో చేరలేదు. ప్రాంతాల వారీగా ఇలా.. ఉంగుటూరు మండలంలో గరిష్టంగా 784 మందికి, లింగపాలెం మండలంలో 674, పెదవేగి మండలంలో 599, పోడూరు మండలంలో 538, దేవరపల్లి మండలంలో 534 మందికి పింఛను సొమ్ములు వారి ఖాతాల్లో వేయలేదు. నరసాపురం, యలమంచిలి, ఇరగవరం, ఆచంట, తాడేపల్లిగూడెం తదితర మండలాల్లో ఒక్కోచోట 400 మందికి పైగా పింఛను సొమ్ము రాలేదు. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో 1,909 మందికి సొమ్ము జమ కాలేదు. గరిష్టంగా ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 771 మందికి, భీమవరం పట్టణంలో 244 మందికి, తణుకులో 246 మందికి పింఛన్లు జమ కాలేదు. మిగిలిన మునిసిపాలిటీల్లో 654 మంది నేటికీ పింఛను సొమ్ముకు నోచుకోలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పింఛను సొమ్మును పంపిణీ చేసేందుకు జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 2,300 రేష¯ŒS డీలర్లు, 350 మంది బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా ఈనెల 6వ తేదీ నుంచి పింఛను సొమ్ము పంపిణీ చేయాలని నిర్ణయించారు. లేవలేని స్థితిలో ఉన్న పింఛనుదారుల ఇళ్లకు వెళ్లి సొమ్ము చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రతి గ్రామానికి ముగ్గురు చొప్పున బిజినెస్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ అంశంపై బ్యాంకు అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. మూడు రోజులుగా తిరుగుతున్నా.. పింఛను డబ్బు కోసం మూడు రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాను. అయినా సొమ్ము అందలేదు. బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేసినట్టు చెప్పారు. బ్యాంకుకు వెళితే.. ఖాతాలో సొమ్ము పడలేదని సిబ్బంది చెబుతున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. – సంపతి అమ్మన్న, తాళ్లపూడి చాలా ఇబ్బంది పడుతున్నాం గతంలో ప్రతినెలా 1వ తేదీన పింఛను సొమ్ము చేతికి ఇచ్చేవారు. ఈ నెల డబ్బులు ఎక్కడ ఇస్తారో తెలియక అయోమయంలో పడ్డాను. బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని చెప్పడంతో బ్యాంకుకు వెళితే అక్కడ ఖాళీ లేదు. నాకు ఏటీఎం కార్డు లేదు. పింఛను డబ్బు ఖాతాలో పడిందో లేదో తెలియడం లేదు. – అంకోలు శేషయ్య, వేగేశ్వరపురం -
కృష్ణా జలాల ఘనత వైఎస్‌దే
అనంతపురం అగ్రికల్చర్: అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి ద్వారా కరువు జిల్లా ‘అనంత’కు కృష్ణా జలాలు తీసుకువచ్చిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కె.వెంకటచౌదరి అన్నా రు. ఈ రోజు పీఏబీఆర్ కుడికాలువ ద్వారా చెరువుల్లోకి కృష్ణా జలాలు చేరుతున్నాయంటే అది వైఎస్ చలవేనన్నా రు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వైఎస్సార్సీపీ నాయకులు గురువారం స్థానిక సుభాష్‌రోడ్డులో ఉన్న దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి కృష్ణమ్మజలాలతో జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలమూరు శ్రీనివాసరెడ్డి, కె.వెంకటచౌదరి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, ట్రేడ్ యూ నియన్ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, సాంస్కృతిక విభా గం జిల్లా అధ్యక్షుడు రిలాక్స్‌నాగరాజు, సేవాదల్ జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోభిలేసు తదితరులు మాట్లాడారు. వెనుకబడిన ‘అనంత’ను సస్యశ్యామలం చేసి రైతులను గట్టెక్కించాలనే సమున్నత ఆశయంతో జలయజ్ఞంలో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టుకు 857 అడుగులు ఎత్తులో ఉన్న జిల్లాకు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నీటిని తీసుకురావడానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.4,294 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. ఎనిమిది లిఫ్టులతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన ఆయన.. జిల్లా ప్రజలు, రైతులకు సాగు, తాగునీటిని అందించారన్నారు. ఇందుకోసం పైసా ఖర్చు చేయని తెలుగుదేశం పార్టీ నేతలు చెరువులకు పీఏబీఆర్ కుడికాలువ ద్వారా నీరు అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం 1996 మార్చి 11న ఉరవకొండ వద్ద, 1999 జూలై 9న ఆత్మకూరు సమీపంలో రెండు సార్లు కేవలం శిలాఫలకాలు ఆవిష్కరించి చేతులు దులుపుకున్నారని గుర్తు చేశారు. కనీసం గంపెడు మట్టి ఎత్తకుండా ఒక అడుగు కాలువ కూడా తీసిన దాఖలాలు లేవన్నారు. అంతేకాకుండా 40 టీఎంసీల సాగునీటి ప్రాజెక్టును 5 టీఎంసీల సాగునీటి ప్రాజెక్టుగా మార్పు చేసే ప్రయత్నం చేసిన చంద్రబాబునాయుడు రైతుద్రోహి అన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ను తానే పూర్తి చేసినట్లు తామే జిల్లాకు నీరు అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు డాంబికాలకు పోతున్నారని దుయ్యబట్టారు. వైఎస్ మరణం తరువాత 90 శాతం పూర్తయిన ప్రాజెక్టు పనులు ఎక్కడిక్కడ ఆగిపోయాయన్నారు. జిల్లా అభివృద్ధిపై చిత్తశుద్ధి వుంటే ఇప్పటికైనా హంద్రీ-నీవాకు నిధులు విడుదల చేసి పూర్తీ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ‘వైఎస్ఆర్ అమర్ రహే... జగన్ నాయకత్వం వర్థిల్లాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ మైనుద్ధీన్, కసనూరు రఘునాథ్‌రెడ్డి, పాలే జయరామ్‌నాయక్, గుర్రం శ్రీనివాసులరెడ్డి, గౌస్‌బేగ్, సీసీ రేవు శంకర్‌రెడ్డి, కుమ్మర ఓబులేసు, కె.విద్యాసాగర్‌రెడ్డి, ముష్టూరు నరసింహారెడ్డి, కేవీ మారుతీప్రకాష్, సురేష్‌రెడ్డి, జేఎం బాషా, శివనాగరాజు, మహబూబ్‌పీరా, ఎస్టేట్ వెంకటరెడ్డి, లోకనాథ్‌రెడ్డి, నారపరెడ్డి, రుద్రంపేట కృష్ణవేణి, మార్కెట్శివ, డీకే రామలింగం, మారేష్, రాజగోపాల్, షరీఫ్, గంగులప్ప, వాయ ల శ్రీనివాసులు, ప్రభాకరరెడ్డి, కృష్ణమూర్తి, వడ్డేశీనా పాల్గొన్నారు.