పిటిషన్ను వెనక్కి తీసుకున్న లగడపాటి | Lagadapati Rajagopal withdraws petition from delhi high court | Sakshi
Sakshi News home page

పిటిషన్ను వెనక్కి తీసుకున్న లగడపాటి

Published Tue, Oct 22 2013 11:49 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM

పిటిషన్ను వెనక్కి తీసుకున్న లగడపాటి

పిటిషన్ను వెనక్కి తీసుకున్న లగడపాటి

న్యూఢిల్లీ : విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ...ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. తమ రాజీనామాను ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కమల్నాథ్ విజ్ఞప్తి మేరకు లగడపాటి తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.

రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తాను సమర్పించిన రాజీనామాను లోకసభ స్పీకర్ ఆమోదించాలని లగడపాటి రాజగోపాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ కోర్టు విచారణకు అనుమతించింది. విచారణను అక్టోబర్ 22వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement