Lagadapati resignation
-
పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న లగడపాటి
న్యూఢిల్లీ : విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ...ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. తమ రాజీనామాను ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ విజ్ఞప్తి మేరకు లగడపాటి తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తాను సమర్పించిన రాజీనామాను లోకసభ స్పీకర్ ఆమోదించాలని లగడపాటి రాజగోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు విచారణకు అనుమతించింది. విచారణను అక్టోబర్ 22వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
స్పీకర్ మీరాకుమార్ను కలవనున్న లగడపాటి
న్యూఢిల్లీ : విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నేడు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ను కలవనున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన తన రాజీనామా లేఖను మరోసారి స్పీకర్‌ను సమర్పించనున్నారు. ఇప్పటికే స్పీకర్ ...లగడపాటితో పాటు మరో 12మంది ఎంపీలు రాజీనామాలు తిరస్కరించిన విషయం తెలిసిందే. భావోద్వేగాల వల్ల రాజీనామా చేశామనే కారణంతో స్పీకర్ తమ రాజీనామాలను తిరస్కరించారని లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. తన రాజీనామా ఆమోదం పొందాక రాష్ట్ర విభజనకు కారకులైన వారి జాతకాలు బయటపెడతానని గతంలో హెచ్చరించారు. ఇక రెండు నెలల క్రితం తాను చేసిన రాజీనామాను ఆమోదించేలా ఆదేశించాలంటూ లగడపాటి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
లగడపాటికి అపాయింట్మెంట్ ఇవ్వని స్పీకర్
న్యూఢిల్లీ : రాజీమానా ఆమోదం కోసం విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. లగడపాటి గురువారం స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయనకు స్పీకర్ మీరాకుమార్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రాజీనామాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని,లోక్‌సభ సెక్రటరీ జనరల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తన రాజీనామా ఆమోదించకపోతే నిరసనకు దిగుతానని లగడపాటి ....లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు తెలిపినట్లు సమాచారం. గతంలో కూడా లగడపాటి రాజగోపాల్ ...మీరాకుమార్ ను కలిసేందుకు ప్రయత్నించగా.... అప్పట్లో ఆమె అందుబాటులో లేరు.