కాట్రేనికోన, న్యూస్‌లైన్ :
కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామంలో ఇంటి స్థలం విషయంలో చెలరేగిన వివాదంలో మోకా కనకరాజు (32)ను అతడి చెల్లెలి భర్త హతమార్చాడు. ఎస్సై పి.వెంకట త్రినాథ్ కథనం ప్రకారం.. కందికుప్పకు చెందిన కనకరాజు కొంత కాలం క్రితం తనకున్న భూమిలోని కొంత భాగాన్ని కట్నంగా ఇచ్చి ఇంటి పక్కనే ఉంటున్న పొద్దూక బాలయోగి అనే వ్యక్తితో తన చెల్లెలి పెళ్లి చేశాడు.
ఈ ఇంటి స్థలం విషయంలో పలుమార్లు బావ బామరుదల మధ్య తగాదాలు తలెత్తగా కుల పెద్దలు సర్ధిచెప్పారు. ఈ నేపథ్యంలో బాలయోగి చెల్లి దాకే లక్ష్మి, దాకే సత్యనారాయణ అయినవిల్లి నుంచి బుధవారం ఇంటికి రావడంతో గొడవ మొదలైంది. కుల పెద్దలు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించినా మాట వినకపోవడంతో వెళ్లిపోయారు.
గురువారం వేకువజామున పొద్దూక పండమ్మ, బాలయోగి, దాకే సత్యనారాయణ, దాకే లక్ష్మి, నాగాభక్తుల శ్రీను మూకుమ్మడిగా కనకరాజు ఇంటిపై దాడి చేశారు. ఇంటిని కూల్చివేసి, కనకరాజు గొంతు నులిమి, కత్తితో తలపై నరికి చం పారు. దాడి సమయంలో ఇంట్లో కనకరాజు తల్లి అప్పయమ్మ, చిన్న కుమారుడు ముఖేష్ ఉన్నారు.
మృతుడి మామ కాశి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై వెంకటత్రినాథ్ తెలిపారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కనకరాజు మృతితో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యా రు. భార్య వరలక్ష్మి, కుమారులు తేజలక్ష్మీ జగ న్, ముఖేష్ ఉన్నారు.
భార్య విదేశాల్లో ఉండగా, పెద్ద కుమారుడు తేజలక్ష్మీ జగన్ ఇందుపల్లిలోని అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. చిన్న కుమారుడు ముఖేష్ మాత్రమే తండ్రితో
ఉంటున్నాడు.
ఉసురు తీసిన స్థల వివాదం
Published Fri, Mar 21 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM
Advertisement