రామచంద్రాపురం: ఓ స్థలానికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం చివరకు హత్యకు దారితీసింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ఎనమదళ్లకు చెందిన జనార్దనరావు (42)కు తన ఇంటి వెనుక స్థలానికి సంబంధించి పొరుగింటివారితో వివాదం ఉంది. దాంతో ప్రత్యర్థులు జనార్దనరావును ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు వేటకొడవళ్లతో నరికి చంపారు. మృతునికి బార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. దుండగులు పరారీలో ఉన్నారు. మృతుని భార్య రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది.