సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం నిరుపేదలకు శాపంగా మారింది. దీం తో పట్టాలు పొందిన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. పంపిణీ చేసిన పలు భూములు స్థానిక పెత్తందారుల స్వాధీనంలో ఉండడంతో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనలపై కలెక్టర్ ప్రద్యుమ్న కు వివిధ సంఘాలు ఇప్పటికే వినతిపత్రాలు అం దజేశాయి. భూ వివాదాలపై వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, లబ్ధిదారులు 2004 నుంచి ఇప్పటి వరకు 104 పర్యాయాలు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతిని ధులకు అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.
భూవివాదాలు ఇలా
సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో సర్వే నం.100 నుంచి 102లో 196 మందికి రెవెన్యూ శాఖ పట్టాలిచ్చినప్పటికీ లబ్ధిదారులు సాగుచేసుకోకుండా అటవీ శాఖ ఆటంకాలు సృష్టిస్తోంది. ఇదే మండల కేంద్రంలోని సర్వే నంబర్ 532లో 707 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమి ఉందని అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని బాధితులు పేర్కొంటున్నారు. రావుట్ల గ్రామం లో సర్వే నంబర్ 276లోని 66 ఎకరాలకు, కమ్మర్‌పల్లి మండలం హసకొత్తూర్‌లో 113 మంది లబ్ధిదారులకు సర్వే నంబర్ 574లో 113ఎకరాలకు పట్టాలిచ్చినప్పటికీ రెవెన్యూ అధికారులు హద్దులు చూపలేకపోయారు.
ఈ భూముల సాగుకు యత్నిస్తే పెత్తందారులు బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఉప్లూర్‌లో సర్వే నంబర్ 364, 362,611,271/1లో 150 ఎకరాల కు పట్టాలిచ్చినా, ఇకకడా అదే పరిస్థితి నెలకొంది. దమ్మన్నపేట గ్రామం లో సర్వే నంబర్ 184లో 50 మంది ఇలాగే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భీంగల్ మండలం మెండోరా గ్రామంలో సర్వే నంబర్ 76లో 70 ఒడ్డెర కుటుంబాలు 134 ఎకరాలను సాగుచేసుకుంటున్నాయి. వారికి ఇంతవరకు పట్టాలు పంపిణీ చేయలేదు. ఇదే సర్వే నంబర్‌లో కొంత మంది పెత్తందారులు 25 ఎకరాలు అక్రమించి పంటలు సాగుచేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు. డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్‌పల్లిలో సర్వే నంబర్ 475లో 70 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమి ఉంది. నడిపల్లి శివారులోని రాంపూర్ రోడ్డులో సర్వే నెంబర్ 334లో 20 ఎకరాలు, రహితుల్లాబాద్‌లో 10 ఎకరాలు, నిజామాబాద్ మండలం బోర్గాం(పి)లోని సర్వే నంబర్ 227లో ఏడు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. వీటి రక్షణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.పైగా కబ్జాదారులకు అండగా ఉం టూ రియల్ ఎస్టేట్ వ్యాపారా న్ని విస్తరింపజేసుకోవడానికి సహకరిస్తున్నారని, బాధితులు, ప్రజాసంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.
కబ్జాలకు హద్దు లేదు
Published Wed, Jan 8 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement
Advertisement