సాక్షి ప్రతినిధి, గుంటూరు : భూ సమీకరణకు శనివారంతో గడువు ముగిసినప్పటికీ ఆదివారం సాయంత్రం వరకు అధికారులు రైతుల నుంచి అంగీకారపత్రాలు స్వీకరించారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు చివరి వారం రోజులు పాలకులు, అధికారులు రైతులపై అన్ని రకాల వత్తిడులు తీసుకువచ్చారు. మార్చి నుంచి భూ సేకరణ ఉంటుందని, ఈ విధానంలో తీవ్రంగా నష్టపోతారని రైతుల్ని భయపెట్టారు. చివరి రెండు రోజుల్లో జరీబు భూముల రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అదనపు ప్యాకేజి ప్రకటించారు.
రాజధాని గ్రామాల వైపు కన్నెత్తి చూడని టీడీపీ పాలకులు చివరి రెండు రోజుల్లో విస్త్రతంగా పర్యటించి, తమ బంధువులు, స్నేహితులతో చర్చలు జరిపి వారితో భూములు ఇప్పించారు. శనివారం ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు రాజధాని గ్రామాల్లోని సీఆర్‌డీఏ కార్యాలయాలు పనిచేశాయి. రైతుల పూర్తి వివరాలు లేకపోయినా, భూ యజమానులు రాకపోయినా వారి బంధువుల నుంచి వ్యవసాయ భూముల ఫొటోస్టాట్ డాక్యుమెంట్లు స్వీకరించి కార్యక్రమం పూర్తయిందనిపించారు. ఆదివారం వాటి పూర్తి వివరాలను సంబంధిత రైతుల నుంచి తీసుకోవడంతోపాటు రైతుల నుంచి కొత్తగా అంగీకారపత్రాలు స్వీకరించారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాలన్నిటిలో ఆదివారం కూడా సీఆర్‌డీఏ కార్యాలయాలు పనిచేశాయి.
మరో ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ సిద్ధం..
నిన్నటి వరకు రైతుల పక్షాన పోరాటం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం నుంచి రైతు కూలీలు, కౌలు రైతులు, చేతి వృత్తి పనివారల హక్కుల కోసం పోరాటం చేసేందుకు సమాయత్తం అవుతోంది. వీరికి కల్పించనున్న ప్రయోజనాలపై అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరిలో మొత్తం 39,509 మంది వ్యవసాయ కూలీలు, కౌలుదారులు ఉన్నారు. అలాగే 16,654 మంది వివిధ వ ృత్తులకు చెందిన కార్మికులు ఉన్నారు. ఇప్పటి వరకు మెట్ట ప్రాంత రైతులు, జరీబు రైతుల ప్రయోజనాలపైనే పూర్తిగా ద ృష్టి కేంద్రకరించిన ప్రభుత్వం వీరిని పూర్తిగా విస్మరించింది.
వారికి సంబంధించిన విషయాలపై ద ృష్టి పెట్టకుండా భూములు అప్పగించిన రైతులకు కౌలు చెల్లింపులు, ఇతర డాక్యుమెంట్లకు సంబంధించిన అంశాలను చేపట్టేందుకు సమాయత్తం అవుతోంది. మార్చి నుంచి సాగుకు అనుమతి లేని గ్రామాల్లోని వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు పూర్తిగా ఉపాధి కోల్పోనున్నారు. వీరికి వ్యవసాయ పనులు మినహా పనుల్లో నైపుణ్యం లేదు. వీరందరికీ భవన నిర్మాణ పనులు, ఇతర పనుల్లో నైపుణ్యం కలిగించేందుకు శిక్షణ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేపట్టలేదు.
వీరి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ మరో ఉద్యమాన్ని చేపట్టనుంది. వీరి హక్కుల పరిరక్షణకు, ప్రయోజనాల కల్పనకు సమాయత్తం అవుతోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 3వ తేదీన రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న నేపథ్యంలో రైతులు, రైతు కూలీలు, వ్వయసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని తమ బాధలను వివరించనున్నారు. అసెంబ్లీలో వీటిని ప్రస్తావించి తమ హక్కులను కాపాడాలని కోరనున్నారు.
ఆగని సమీకరణ!
Published Mon, Mar 2 2015 2:55 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement