సాక్షి, హైదరాబాద్: సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా నడవనుంది. ఢిల్లీలో పొగమంచు కారణంగా అక్కడి నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా రావటంతో ఉదయం 6.25కు బదులు 10.25కు బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు.
సికింద్రాబాద్ స్టేషన్‌లో రైల్వే అధికారుల తనిఖీలు
సికింద్రాబాద్ స్టేషన్‌లో రైల్వే అధికారులు తనిఖీలు నిర్వహించారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 1,118 మంది, రిజర్వేషన్ లేని టికె ట్లతో రిజర్వ్‌డ్ బోగీల్లో ప్రయాణిస్తున్న 1,572 మంది, బుకింగ్ లేని లగేజీని తరలిస్తున్న 133 మంది నుంచి పెనాల్టీగా రూ.14.45 లక్షలను వసూలు చేసినట్టు సీపీఆర్‌ఓ సాంబశివరావు తెలిపారు.
నేడు ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్
Published Mon, Jan 12 2015 12:43 AM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM
Advertisement
Advertisement