మే 30న ‘లాసెట్’ రాత పరీక్ష | law cet exam on may 30 | Sakshi
Sakshi News home page

మే 30న ‘లాసెట్’ రాత పరీక్ష

Published Wed, Apr 22 2015 4:37 AM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM

law cet exam on may 30

అనంతపురం: రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్ల బీఎల్, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ డిగ్రీ,  రెండేళ్ల పీజీ ఎల్‌ఎల్‌ఎం, ఎంఎల్ ప్రవేశాలకు నిర్వహించే ‘లాసెట్-2015’ రాత పరీక్షలను మే 30న నిర్వహించనున్నట్లు లాసెట్ రాష్ట్ర కన్వీనర్ ఆచార్య శేషయ్య వెల్లడించారు. ఎస్కేయూలోని ఏపీ లాసెట్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.350 ఫీజుతో ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 7 వరకు రూ.500, మే 15 వరకు రూ.1,000, మే 23 వరకు రూ.1,500 అపరాధ రుసుంతో దరఖాస్తు చేయడానికి వెసులుబాటు కల్పించినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement