6న లాసెట్ నోటిఫికేషన్ | LAWCET 2014 Notification will be announced on March 6 | Sakshi
Sakshi News home page

6న లాసెట్ నోటిఫికేషన్

Published Tue, Feb 18 2014 5:37 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM

6న లాసెట్ నోటిఫికేషన్

6న లాసెట్ నోటిఫికేషన్

8 నుంచి దరఖాస్తుల ప్రక్రియ
జూన్ 8 న ప్రవేశపరీక్ష

 
 తిరుపతి, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని న్యాయకళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్-2014కు మార్చి 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీ వరుసగా ఆరోసారి లాసెట్, పీజీ లాసెట్ నిర్వహిస్తోందన్నారు. లాసెట్-2014 నిర్వహణపై సోమవారం ఎస్వీయూలో జరిగిన సమీక్ష సమావేశానికి ఈయనతో పాటు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ విజయ్‌ప్రకాశ్, కార్యదర్శి సతీష్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా తదితరులు హాజరయ్యారు. అనంతరం వివరాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి మీడియాకు తెలిపారు.
 
 ఈ ఏడాది లాసెట్, పీజీ లాసెట్‌కు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఇందుకోసం మార్చి 6న నోటిఫికేషన్ విడుదలవుతుందన్నారు. 8 నుంచి ఏప్రిల్ 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రూ.200 అపరాధ రుసుముతో మే 5వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుముతో మే 12 వరకు, రూ.1000 అపరాధ రుసుముతో మే 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అయితే, రూ.1000 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునేవారు తిరుపతి కేంద్రంలో మాత్రమే పరీక్షరాయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 కేంద్రాల్లో జూన్8న పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement