ఏలూరు టౌన్ : ప్రత్యేక హోదా– ఆంధ్రుల హక్కు అంటూ కేంద్ర, రాష్ట్రాలపై పోరాటం చేస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు పలుకుతూ ఏలూరు జిల్లా కోర్టులోని న్యాయవాదుల బృందం శనివారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లాకు తరలివెళ్లింది. వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ఇంటి వద్ద నుంచి ప్రారంభమైన బస్సు యాత్రకు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ కోటగిరి శ్రీధర్, ఏలూరు కన్వీనర్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ అని ఆయనకు న్యాయవాదులు మద్దతు తెలపడం శుభపరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దిరిశాల వరప్రసాద్, నెరుసు చిరంజీవి, బాలిన ధనలక్ష్మి, మున్ని, బోడా కిరణ్, పసుపులేటి శేషు, కొత్తపల్లి రాజేష్, మేతర సురేష్, కిలాడి దుర్గారావు, కంచెన రామకృష్ణ, వైఎన్‌వీ శివరావు, యల్లపు మోజెస్, ఎ.నాగేశ్వరరావు, ఎం.ప్రవీణ్‌బాబు తదితరులున్నారు.
జగన్‌ను కలిసిన న్యాయవాదులు
ప్రకాశం జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని శనివారం సాయంత్రం ఏలూరు న్యాయవాదుల బృందం కలిసింది. ఈ సందర్భంగా న్యాయవాదులు ఆచంట వెంకటేశ్వరరావు, మున్నుల జాన్‌గురునాథ్, రామాంజనేయులు, శశిధర్‌రెడ్డి తదితరులు ఆయనకు మద్దతు తెలిపారు. జగన్ చేస్తున్న పోరాటానికి తాము అండగా ఉంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment