కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోం | leaders have trouble urukom | Sakshi
Sakshi News home page

కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోం

Published Sun, Mar 6 2016 3:33 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోం - Sakshi

కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోం

నంద్యాల టౌన్: ‘పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు కార్యకర్తలను అనగదొక్కడానికి యత్నించినా, ఇబ్బందులు పెట్టినా చూస్తూ ఊరుకోబోమ’ని మాజీ మంత్రి, టీడీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ శిల్పామోహన్‌రెడ్డి హెచ్చరించారు. స్థానిక టెక్కె మార్కెట్ యార్డులో ఆయన శనివా రం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదేళ్లలో ఎన్నో  అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేసినా  కొత్త నాయకులు విమర్శలు చేయడం తగదన్నారు.

నియోజకవర్గానికి  తానే ఇన్‌చార్జిగా ఉంటానని, ఎమ్మెల్యేగా భూమానాగిరెడ్డికి ప్రొటోకాల్ మాత్రమే ఉంటుందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పురుషోత్తమరెడ్డి, పార్టీ లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి తులసిరెడ్డి, రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, ఆర్‌జీఎం విద్యాసంస్థల అధినేత శాంతిరాముడు, కాపు కార్పొరేషన్ డెరైక్టర్ రామచంద్రారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement