bhumanagireddy
-
నివాళ్లర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు
నంద్యాల: భూమా నాగిరెడ్డి మృతదేహన్ని నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు తరలించారు. వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి భూమా నాగిరెడ్డి మృతదేహనికి నివాళ్లర్పించారు. ఆళ్లగడ్డకు కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రేపు ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. -
కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోం
నంద్యాల టౌన్: ‘పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు కార్యకర్తలను అనగదొక్కడానికి యత్నించినా, ఇబ్బందులు పెట్టినా చూస్తూ ఊరుకోబోమ’ని మాజీ మంత్రి, టీడీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ శిల్పామోహన్‌రెడ్డి హెచ్చరించారు. స్థానిక టెక్కె మార్కెట్ యార్డులో ఆయన శనివా రం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదేళ్లలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేసినా కొత్త నాయకులు విమర్శలు చేయడం తగదన్నారు. నియోజకవర్గానికి తానే ఇన్చార్జిగా ఉంటానని, ఎమ్మెల్యేగా భూమానాగిరెడ్డికి ప్రొటోకాల్ మాత్రమే ఉంటుందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పురుషోత్తమరెడ్డి, పార్టీ లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి తులసిరెడ్డి, రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, ఆర్జీఎం విద్యాసంస్థల అధినేత శాంతిరాముడు, కాపు కార్పొరేషన్ డెరైక్టర్ రామచంద్రారావు తదితరులు పాల్గొన్నారు. -
అసత్య ప్రచారం
పార్టీని ఎవరూ వీడటం లేదు ఇదంతా చంద్రబాబు మైండ్‌గేమ్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే యత్నం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి సాక్షి, కర్నూలు:జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడటం లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం నుంచి నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు భూమానాగిరెడ్డి, భూమా అఖిల ప్రియారెడ్డి.. టీడీపీలో చేరుతున్నట్లు అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి మైండ్ గేమ్ అన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ బాబు తుంగలో తొక్కారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల్ని పక్కదోవ పట్టిం చేందుకు ఎలాంటి నీచ ప్రయత్నాలైనా చేయడానికి చంద్రబాబు వెనుకాడరు’ అని బుడ్డా ధ్వజమెత్తారు. అందులో భాగంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతున్నారంటూ శుక్రవారం ప్రచారం మొదలెట్టారని విమర్శించారు. చంద్రబాబు మైండ్‌గేమ్ అడుతున్నారని, జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ వీడటం లేదని బుడ్డా స్పష్టం చేశారు. ‘ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలకే ఏ ఒక్క పని జరగడం లేదు. వారంతా అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలే మా వైపు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మునిగే పడవ ఎవరైనా ఎక్కుతారా’ అని అన్నారు. వైఎస్సార్సీపీ నుంచి మరికొంత మంది ఎమ్మెల్యేలు టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారని పుకార్లు షికారు చేస్తున్న నేపథ్యంలో.. కర్నూలు, పాణ్యం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డిలు స్పందించారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడే ప్రసక్తే లేదని చెప్పారు. -
సమైక్య ద్రోహులకు బుద్ధిచెబుదాం
స నంద్యాలమైక్య ద్రోహులకు బుద్ధిచెబుదాం , : రానున్న ఎన్నికల్లో సమైక్యద్రోహులకు ఓటుతో బుద్ధిచెప్పాలని విద్యార్థులకు వైఎస్సార్సీపీ నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త భూమానాగిరెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థుల కోసం తన సొంత నిధులతో ఉచిత వైఫై సౌకర్యాన్ని శనివారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో భూమా నాగిరెడ్డి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ టౌన్హాల్లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర విభజన అంశం ప్రతి ఒక్కరినీ బాధిస్తోందన్నారు. డిగ్రీ, పీజీ చదువుతున్న, చదివిన విద్యార్థులకు ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుందని, వచ్చే సాధారణ ఎన్నికల్లో సమైక్య ద్రోహులకు షాక్‌ను ఇచ్చే తీర్పునివ్వాలన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న పార్టీలను ఓడించాలన్నారు. ఏ పార్టీలు సమైక్య ద్రోహానికి పాల్పడ్డాయో అందరికీ తెలుసని, ఓటర్ల నిర్ణయం రేపటి ఎన్నికల్లో కీలకం కాబోతున్నదన్నారు. ఓటు హక్కులేని వారు దానిని పొందాలని, ఇబ్బందులు పడేవారు తమ పార్టీ కార్యకర్తలను ఆశ్రయించాలని సూచించారు. రాష్ట్రం చీలిపోతే అడవుల్లో జీవించినట్లు ఉంటుందని, విద్యార్థులు వచ్చే ఎన్నికల్లో తీవ్రస్థాయిలో స్పందించాలని కోరారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే ఈ రోజు సీమాంధ్ర ప్రజలు రాజాగా జీవించేవారి భూమా అన్నారు. వైఎస్ తర్వాత మరో సమర్థుడైన నాయుడు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే విషయాన్ని విస్మరించరాదన్నారు. జననేత పోరాటం వల్లే ఇంత వరకు విభజన జరగలేదని చెప్పారు. వచ్చే ఎన్నికల వరకు ఇలాగే కొనసాగితే కేంద్రంలో, రాష్ట్రంలో వైఎస్సార్సీపీ చక్రం తిప్పుతుందన్నారు. పట్టణంలో దాదాపు 20 జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కళాశాలల విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు భూమా తెలిపారు. ఉచిత ఇంటర్నెట్ సౌకర్యంతో తమకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఏవీఆర్ ప్రసాద్, సిటీ కేబుల్ మేనేజర్ జయచంద్రారెడ్డి, గురునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.