అసత్య ప్రచారం | chandra babu naidu is mind gaming | Sakshi
Sakshi News home page

అసత్య ప్రచారం

Published Sat, Feb 20 2016 3:08 AM | Last Updated on Tue, May 29 2018 2:55 PM

అసత్య ప్రచారం - Sakshi

అసత్య ప్రచారం

పార్టీని ఎవరూ వీడటం లేదు
ఇదంతా చంద్రబాబు మైండ్‌గేమ్
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే యత్నం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి


సాక్షి, కర్నూలు:జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడటం లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం నుంచి నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు భూమానాగిరెడ్డి, భూమా అఖిల ప్రియారెడ్డి.. టీడీపీలో చేరుతున్నట్లు అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి మైండ్ గేమ్ అన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ బాబు తుంగలో తొక్కారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల్ని పక్కదోవ పట్టిం చేందుకు ఎలాంటి నీచ ప్రయత్నాలైనా చేయడానికి చంద్రబాబు వెనుకాడరు’ అని  బుడ్డా ధ్వజమెత్తారు. అందులో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతున్నారంటూ శుక్రవారం ప్రచారం మొదలెట్టారని విమర్శించారు. చంద్రబాబు మైండ్‌గేమ్ అడుతున్నారని,  జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ వీడటం లేదని బుడ్డా స్పష్టం చేశారు. ‘ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలకే ఏ ఒక్క పని జరగడం లేదు. వారంతా అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలే మా వైపు చూస్తున్నారు.  ఇలాంటి సమయంలో మునిగే పడవ ఎవరైనా ఎక్కుతారా’ అని  అన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి మరికొంత మంది ఎమ్మెల్యేలు టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారని పుకార్లు షికారు చేస్తున్న నేపథ్యంలో.. కర్నూలు, పాణ్యం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డిలు స్పందించారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడే ప్రసక్తే లేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement