చంద్రబాబు గిమ్మిక్కులతో టీడీపీ బలపడదు | Buddha Rajasekhara Reddy commented by chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు గిమ్మిక్కులతో టీడీపీ బలపడదు

Published Thu, Feb 25 2016 3:08 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

Buddha Rajasekhara Reddy commented by chandrababu naidu

 కర్నూలు(ఓల్డ్‌సిటీ): చంద్రబాబు నీతి నేతి బీరకాయ చందంగా మారిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి విమర్శిం చారు. తెలంగాణాలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు ఏపీలో తాను చేస్తున్నదేంటని ప్రశ్నించారు. ఆయన మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. నలుగురు ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నంత మాత్రాన టీడీపీ బలపడబోదన్నారు. రాజకీయ విలువలను తుంగలో తొక్కినందుకు సీఎం సిగ్గుపడాలని పేర్కొన్నారు. ధైర్యముంటే పదవికి రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో  సవాల్ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement