సమైక్య ద్రోహులకు బుద్ధిచెబుదాం
స నంద్యాలమైక్య ద్రోహులకు బుద్ధిచెబుదాం
, : రానున్న ఎన్నికల్లో సమైక్యద్రోహులకు ఓటుతో బుద్ధిచెప్పాలని విద్యార్థులకు వైఎస్సార్సీపీ నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త భూమానాగిరెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థుల కోసం తన సొంత నిధులతో ఉచిత వైఫై సౌకర్యాన్ని శనివారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో భూమా నాగిరెడ్డి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ టౌన్‌హాల్‌లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర విభజన అంశం ప్రతి ఒక్కరినీ బాధిస్తోందన్నారు. డిగ్రీ, పీజీ చదువుతున్న, చదివిన విద్యార్థులకు ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుందని, వచ్చే సాధారణ ఎన్నికల్లో సమైక్య ద్రోహులకు షాక్‌ను ఇచ్చే తీర్పునివ్వాలన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న పార్టీలను ఓడించాలన్నారు. ఏ పార్టీలు సమైక్య ద్రోహానికి పాల్పడ్డాయో అందరికీ తెలుసని, ఓటర్ల నిర్ణయం రేపటి ఎన్నికల్లో కీలకం కాబోతున్నదన్నారు. ఓటు హక్కులేని వారు దానిని పొందాలని, ఇబ్బందులు పడేవారు తమ పార్టీ కార్యకర్తలను ఆశ్రయించాలని సూచించారు. రాష్ట్రం చీలిపోతే అడవుల్లో జీవించినట్లు ఉంటుందని, విద్యార్థులు వచ్చే ఎన్నికల్లో తీవ్రస్థాయిలో స్పందించాలని కోరారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే ఈ రోజు సీమాంధ్ర ప్రజలు రాజాగా జీవించేవారి భూమా అన్నారు. వైఎస్ తర్వాత మరో సమర్థుడైన నాయుడు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనే విషయాన్ని విస్మరించరాదన్నారు. జననేత పోరాటం వల్లే ఇంత వరకు విభజన జరగలేదని చెప్పారు. వచ్చే ఎన్నికల వరకు ఇలాగే కొనసాగితే కేంద్రంలో, రాష్ట్రంలో వైఎస్సార్సీపీ చక్రం తిప్పుతుందన్నారు. పట్టణంలో దాదాపు 20 జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కళాశాలల విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు భూమా తెలిపారు. ఉచిత ఇంటర్నెట్ సౌకర్యంతో తమకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఏవీఆర్ ప్రసాద్, సిటీ కేబుల్ మేనేజర్ జయచంద్రారెడ్డి, గురునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.