మామిడికుదురు: ‘పట్టపగలే వెలుగుతున్న వీధి లైట్లు’ అంటూ తరచు పేపర్లో వార్తలు చూస్తుంటాం. ఇక నుంచి వీటికి ముగింపు పలికేలా వీధి లైట్ల ఆఫ్, ఆన్ విధానాన్ని సెల్‌కు అనుసంధానం చేశారు. దీనిని ప్రయోగాత్మకంగా మామిడికుదురులో ఇటీవల రెండుచోట్ల ప్రవేశ పెట్టగా ఎంతో మెరుగ్గా ఉందని పంచాయతీ ఉద్యోగులంటున్నారు. లైట్ల మీటరు ఉండే స్తంభం వద్ద ఏర్పాటు చే సిన పరికరంలో సిమ్ కార్డు అమర్చి, ఆ నెంబర్‌ను అసిస్టెంట్ లైన్‌మన్ సెల్‌లో రిజిస్టర్ చేశారు.
ఆయన సాయంత్రమయ్యే సరికి తన నెంబర్ నుంచి మీటర్ వద్దనున్న నంబర్‌కు మిస్డ్ కాల్ చేస్తే వీధి లైట్లు వెలుగుతాయి. అలాగే ఆరిపోతారుు కూడా. విద్యుత్ సరఫరా నిలిచి పోయినా, వీధి లైట్లను వేళకు ఆన్ లేదా ఆఫ్ చేయకపోయినా అసిస్టెంట్ లైన్‌మన్ సెల్‌కు ఆటోమేటిక్‌గా మెసేజ్ వస్తుంది. ఆ వెంటనే ఆయన మిస్డ్ కాల్ చేస్తే ఆరిపోరుున లైట్లు వెలుగుతాయి. లేదా వెలుగుతున్న లైట్లు రిపోతాయి. ఈ విధానాన్ని జిల్లావ్యాప్తంగా ప్రవేశ పెట్టేందుకు పంచాయతీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
మిస్డ్ కాల్‌తో లైట్స్ ‘ఆన్ అండ్ ఆఫ్’
Published Fri, May 8 2015 2:15 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement
Advertisement