
లిక్విడ్ ఆక్సిజన్ లీక్‌తో గన్నవరంలో కలకలం!
విజయవాడ: గన‍్నవరం విమానాశ్రయం సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ట్యాంకర్ నుంచి లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అవ్వడం కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ‍్నం ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న ట్యాంకర్ నుంచి లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డుపక‍్కన ఆపేశాడు.
దీంతో ఆ ప్రాంతమంతా దట‍్టమైన పొగ కమ‍్ముకుంది. తెల్లని దట్టమైన పొగ కమ్ముకుండటంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళన చెందారు. ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ట్యాంకర్ నుంచి ఆక్సిజన్ లీక్ కాకుండా ప్రయత్నిస్తున్నారు.