
ముగిసిన లోకేశ్ అమెరికా పర్యటన
హైదరాబాద్: ‘స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డు’ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐలను భాగస్వాములను చేయడం, ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మలిచే ఉద్దేశంతో టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ నిర్వహించిన అమెరికా పర్యటన ముగిసింది.
ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన ఈ పర్యటన విజయవంతమైనట్లు ఆ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్‌ఆర్కే ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా లోకేశ్ 7 నగరాల్లో 5 వేల మందికిపైగా ఎన్నారైలతో, ఒబామా మొదలు బాబీ జిందాల్ వరకు ప్రముఖులతో వరుస భేటీలు, సమావేశాలు నిర్వహించారని చెప్పారు. కాగా లోకేశ్ శుక్రవారం హైదరాబాదుకు చేరుకోనున్నారు.