కేంద్రమాజీ మంత్రి కృపారాణి కారు, (ఇన్‌సెట్లో) నంబరు ప్లేట్‌పై మెంబర్ ఆఫ్ లోక్‌సభ అని ఉన్న దృశ్యం
శ్రీకాకుళం : కేంద్ర మాజీ ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కారు నంబరు ప్లేట్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమె వాహనం నంబరు ప్లేట్‌పై ‘మెంబర్ ఆఫ్ లోక్‌సభ’అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. ఆమె గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గురువారం కలెక్టరేట్ వద్ద వివిధ సంఘాలు, ప్రభుత్వ పథకాల మహిళా ఉద్యోగులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సీఐటీయూకు మద్దతుగా కృపారాణి వచ్చి వాళ్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వాహనం నంబరు ప్లేట్ చూసి ఔరా! పదవిపై ఇంకా కోరిక తీరలేదా అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు.