కొమరోలు (ప్రకాశం) : దొంగలు రహదారిపై ఆగి ఉన్న లారీలను కూడా వదిలిపెట్టడం లేదు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంక్ దగ్గర నిలిపి ఉంచిన లారీని శనివారం అర్ధరాత్రి తర్వాత దొంగలు మాయం చేశారు. ఆదివారం ఉదయం దాని యజమాని సంగు బ్రహ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. మండలంలోని గోనెపల్లి వద్ద వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిలో లారీని గుర్తించారు.. కానీ, దొంగలు లారీని మాత్రం వదిలిపెట్టి దాని టైర్లు, బ్యాటరీ, డీజిల్, ఇతర ముఖ్యమైన పరికరాలన్నింటితో ఉడాయించారు!