పెదపాడు, న్యూస్‌లైన్ : గ్రామాల్లో ఇంటి పన్నుల విధింపు వ్యవహారం అధికారులకు సొమ్ములు కురిపిస్తోంది. పంచాయతీల ఆదాయానికి తూట్లు పొడుస్తోంది. శాస్త్రీయ విధానం పాటించకుండా ఎవరికి తోచినట్లు వారు పన్నుల విధిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు చెందిన ఇళ్లకు పూర్తిస్థారుులో పన్నులు విధిస్తున్నా.. వ్యాపార సంస్థలు, బడా బాబులకు చెందిన కట్టడాలపై మాత్రం కరుణ చూపిస్తూ పంచాయతీ ఆదాయూనికి గండి కొడుతున్నారు. దీనివల్ల జిల్లాలోని పంచాయతీలకు ఏటా కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లుతోంది.
విధానమిదీ..
పన్నులు విధించే సందర్భంలో ఇల్లు లేదా సంబంధిత కట్టడం విస్తీర్ణాన్ని చదరపు అడుగులలో లెక్కించాలి. ఇంటిస్థలం విలువను ప్రభుత్వ నిర్దేశించిన ధరలను పరిగణనలోకి తీసుకోవాలి. దానికి భవన నిర్మాణానికి చేసిన వ్యయం కలిపి ఆ మొత్తంలో 2 శాతం ఇంటి పన్ను వేయాలి. గుడిసెల్లో ఉండేవారికి.. చిన్నపాటి పెంకుటిళ్లలో ఉండేవారికి సక్రమంగానే పన్నులు విధిస్తున్నా.. డాబాలు బహుళ అంతస్తులు గల భవనాలకు మాత్రమే సక్రమంగా పన్ను విధించడం లేదు. ఇంటిపన్ను మదింపు విధానాన్ని 20 ఏళ్ల క్రితం మదింపు చేశారు. దాని ఆధారంగా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏటా 5 శాతం ఇంటిపన్ను పెంచాల్సి ఉంటుంది.
2000 చదరపు అడుగుల ఇంటికి సైతం కేవలం రూ,500నుండి రూ.1,500లోపు పన్ను విధించడం వల్ల పంచాయతీల ఆదాయం భారీగా పడిపోతోంది. కట్టడం రకాన్ని బట్టి పన్ను నిర్ణయించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా సాగుతోంది. గుడిసె, పెంకుటిల్లు, రేకుల స్లాబ్, డూప్లెక్స్, మల్టీస్టోర్‌డ్ (బహుళ అంతస్తుల) బిల్డింగ్‌లలో ఒక్కొక్క దానికి ఒక్కోరకంగా పన్ను విధించాల్సి ఉంది. కమ్యూనిటీ హాల్స్, కల్యాణ మండపాలు, సినిమా హాల్స్, రెస్టారెంట్లు, హోటళ్లు, విద్యాసంస్థలకు మరో రకమైన పన్ను విధానాన్ని అవలంభిస్తారు. జిల్లాలో ఎక్కడా ఇలా చేయడం లేదు.
అన్నిటికీ ఒకటే పన్ను
వ్యాపారాలు నిర్వహించే భవనాలు, ప్రైవేటు విద్యాసంస్థలు, కల్యాణ మండపాలు, కార్పొరేట్ సంస్థలకు వర్గీకరణతో సంబంధం లేకుండా అన్నిటికీ ఒకే తరహా పన్ను విధిస్తున్నారు. భవన యజమానులిచ్చే కాసులకు కక్కుర్తిపడి పంచాయతీల ఆదాయూనికి గండికొడుతున్నారు. ఉదాహరణకు పెదపాడు మండలం లోని వట్లూరులో ఒక ఏసీ కల్యాణ మండపం ఉంది. దీని ఒకరోజు అద్దె రూ.లక్ష వసూలు చేస్తున్నారు. దీనికి ఏడాదికి రూ.59,030 మాత్రమే పన్ను వేశారు. నాయుడుగూడెంలో ఓ బహుళ అంతస్తుల భవనం ఉంది. ఇందులో ఓ బ్యాంకు, ఇతర వ్యాపార సంస్థలు నడుస్తున్నారుు.
దీనికి కేవలం రూ.1,500 మాత్రమే పన్ను వేశారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఓ భవనానికి సంవత్సరానికి వచ్చే అద్దెలో 90రోజుల అద్దెను పన్నుగా విధించాలి. మండలంలోని అప్పనవీడు, ఏపూరు పరిధిలో గల షాపింగ్ కాంప్లెక్సులలో ఒక్కొక్క షాపు నుంచి నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ అద్దె వసూలు చేస్తున్నారు. రూ.10వేలు అద్దె వస్తున్న షాపునకు రూ.30వేలు పన్ను చెల్లిం చాలి. కానీ.. వారినుంచి వసూలు చేస్తున్నది రూ.వెరుు్య నుంచి రూ.2 వేలలోపు మాత్రమే. దీనివల్ల పంచాయతీలకు కోట్లాది రూపాయల ఆదాయ నష్టం వాటిల్లుతోంది. దీంతో గ్రామా ల్లో అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ పనులు కుం టుపడుతున్నారుు. కొన్నిచోట్ల సిబ్బందికి జీతా లు ఇవ్వలేని దుస్థితి నెలకొంది.
పట్టించుకోని ఈవోపీఆర్‌డీలు
పన్నుల సవరణ సందర్భంలో ఇంటి ఫొటో తీ రుుంచాలి. ఇంటి విస్తీర్ణాన్ని శాస్త్రీయంగా లెక్కగట్టిన తరువాత వాటిని తనిఖీ చేయూల్సిన బాధ్య త ఈవోపీఆర్‌డీలదే. అనంతరం వాటిని డీఎల్‌పీవోలకు అప్పగించాలి. ఈ తంతు ఎక్కడా జరగడం లేదు. ఉన్నతాధికారులు సిబ్బంది లేరనే సాకుతో పన్నుల సవరణ చేయడం లేదు. గ్రామ కార్యదర్శుల సహకారంతో చేపట్టే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు.
సొమ్ముకొట్టు.. పన్ను ఎగ్గొట్టు
Published Tue, Dec 3 2013 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
Advertisement