pedapadu
-
ఆటో కారు ఢీ,ఇద్దరు మృతి
-
ఘోర ప్రమాదం.. మహిళా, చిన్నారి మృతి
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని పెద్దపాడు మండలం ఏపూరు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో మహిళతో పాటు ఓ చిన్నారి మృతి చెందింది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని హుటాహుటిన 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆటోలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బంగారం దుకాణంలో భారీ చోరీ!
సాక్షి, పశ్చిమగోదావరి(పెదపాడు) : జ్యూయలరీ షాపు గోడకు కన్నం పెట్టి సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు దోచుకుపోయిన సంఘటన పెదపాడు మండల పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదపాడు మండలంలోని అప్పనవీడులో జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ఆంజనేయ జ్యూయలరీ షాపు యజమాని బుధవారం రాత్రి 10 గంటల సమయంలో దుకాణం మూసివేసి బాపులపాడులోని ఇందిరానగర్‌లోని తన ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం 9 గంటల సమయంలో పక్కనే ఉన్న బేకరీ యజమాని ఫోన్ చేసి మీషాపు గోడ రంద్రం పెట్టి ఉన్నట్లు జ్యూయలరీ షాపు యజమానికి తెలియజేశాడు. దీంతో షాపు తెరచి చూడగా షాపులోని చెవి దుద్దులు, జుంకాలు, పాపిడి బిల్లలు, మేటీలు ఇతర బంగారు వస్తువులతో పాటు 250 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో పెదపాడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పెదపాడు పోలీసులు అక్కడకు చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు సేకరణ చేసారు. షాపు యజమాని బొల్లంకి అప్పారావు ఫిర్యాదు మేరకు పెదపాడు ఎస్సైజీ జ్యోతి బసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ జెండా కట్టినందుకు..
సాక్షి, పెదపాడు: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. వైఎస్సార్ సీపీ జెండాను ఇంటిపై కట్టినందుకు ఓ వ్యక్తిపై కక్ష సాధింపునకు దిగారు. ప్రభుత్వ భూమిగా సాకు చూపి, ఆ వ్యక్తి ఇంటి స్థలంలో నుంచి రోడ్డు వేయించే పనికి పూనుకున్నారు. అడ్డుపడిన మహిళను పోలీసులు దౌర్జన్యంగా తోసివేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెం గ్రామానికి చెందిన పిట్టా విజయ్‌కుమార్, పిట్టా స్టీఫెన్‌కు తాతల కాలం నుంచి సంక్రమించిన స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. వారు వైఎస్సార్ సీపీపై అభిమానంతో ఇంటిపై వైసీపీ జెండా కట్టారు. దీంతో భగ్గుమన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరవర్గం.. ఆ స్థలం ప్రభుత్వానిదంటూ.. అధికారులపై ఒత్తిడి తెచ్చి రహదారి నిర్మించేందుకు పూనుకున్నారు. అందుకోసం అధికారులు ఇంటిని తొలగించేందుకు సిద్ధం కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే మరడాని రంగారావు తదితరులు ఘటనా స్థలానికి వెళ్లి ఎమ్మార్వోతో చర్చలు జరిపారు. రెండురోజులు గడువు ఇచ్చిన అధికారులు గురువారం తెల్లవారుజామున భారీ పోలీసు బందోబస్తుతో రంగంలోకి దిగి ఇంటి తొలగింపునకు చర్యలు చేపట్టారు. తొలగింపు పనులను అడ్డుకున్న విజయకుమార్ భార్య విజయకుమారిని పోలీసులు నెట్టివేయడంతో కిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కోటగిరి శ్రీధర్, దెందులూరు నియోజకవర్గ ఇన్చార్జి కొఠారు అబ్బయ్య చౌదరి, అప్పనప్రసాద్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మొండెం ఆనంద్, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు పల్లెం ప్రసాద్ ఆమెను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడటం హేయమైన చర్య అని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. -
ఏలూరు హత్యకేసులో నిందితుల అరెస్ట్
పెదపాడు: పెదపాడు మండలం నాయుడు గూడెంలో మే 16న జరిగిన కొల్లి మోహన్ హత్య కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తన భార్య భార్గవితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కొల్లి నాగమోహన్ అనే వ్యక్తిని భార్గవి భర్త బేతపూడి ఉదయకుమార్ మరో ముగ్గురితో కలిసిన మే 16న దారుణంగా హత్య చేశారు. ఏలూరులో డీఎస్పీ జి. వెంకటేశ్వరరావు, ఏలూరు రూరల్ సీఐ ఏఎన్ మురళి, పెద్దపాడు ఎస్ఐ కె.రామకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. -
కష్టార్జితం బూడిద
పెదపాడు గాంధీనగర్‌లో అగ్ని ప్రమాదం 19 పూరిళ్లు దగ్ధం కట్టుబట్టలతో మిగిలిన బాధితులు రూ.25 లక్షలు ఆస్తినష్టం పాతశ్రీకాకుళం/శ్రీకాకుళం సిటీ: శ్రీకాకుళం రూరల్ మండలం పెదపాడు గాంధీనగర్‌లో సోమవారం మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాదంలో 19 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో సుమారు 25 లక్షల రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకు కావడంతో మంటలు వ్యాపించి ప్రమాదం సంభవించినట్టు స్థానికులు చెబుతున్నారు. బాధితులంతా నిరుపేదలు కావడం, ఉన్నదంతా అగ్నికి ఆహుతి కావడంతో వారంతా నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో మిగిలారు. మంటలు భారీగా ఎగిసిపడడంతో ఇళ్లలోని నాలుగు గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాంధీనగర్ శివారులో 23 పూరిళ్లలో కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా వీధివ్యాపారులు చేసుకోవడం, ఇళ్లలో పాచిపనులు చేసుకొని జీవిస్తున్నారు. వీరిలో 19 కుటుంబాలకు చెందిన ఇళ్లు బూడిద కావడంతో వారంతా తీవ్రంగా నష్టపోయారు. ప్రమాద సమాయంలో ఓ ఇంటిలో అంగన్వాడీ కేంద్రం నడుస్తోంది. అరుుతే పక్కనే ఉన్న ఇల్లు బూడిదవ్వగా.. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో అంగన్వాడీ కేంద్రానికి ప్రమాదం తప్పింది. అందులో ఉన్న 38 మంది పిల్లలను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకొని వెళ్లిపోయారు. బాధిత కుటుంబాలు.. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోరుున వారిలో దాసు అప్పన్న, దాసు పోలయ్య, పట్ట అప్పమ్మ, పట్ట నీలరాజు, పట్ట రాము, కలగ సూర్యనారాయణ, తొగరాపు లక్ష్మి, కోరాడ రాజు, మగడ అప్పారావు, తొగరాపు కామేశ్వరి, సవలాపురం గణేష్, పోలాకి లక్ష్మి, దువ్వ సూర్యనారాయణ, ఎచ్చెర్ల రామకృష్ణ, కోడ తిరుపతిరావు, దువ్వ పంటోడు, కొవరాపు కృష్ణ, ఎచ్చెర్ల ఎర్రమ్మ, బి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం సమాచారం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. దీంతో ఆస్తి నష్టం తగ్గింది. నష్టం రూ.25 లక్షలు ప్రమాదంలో 19 మంది బాధితులకు సంబంధించి సుమారు 25 లక్షల రూపాయలు ఆస్తినష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని శ్రీకాకుళం తహసీల్దార్ సుధాసాగర్ తెలిపారు. పెద్దపాడు సొసైటీ భూముల్లో వీరు పూరిళ్లలో నివసిస్తున్నారన్నారు. 30 నిమిషాల వ్యవధిలోనే ఇళ్లన్నీ దగ్ధమయ్యావని, ప్రమాద విషయాన్ని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. తక్షణ సాయంగా బాధితులకు పదేసి కిలోల చొప్పున బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్, రూ.5 వేల నగదు ఇస్తామన్నారు. రెడ్‌క్రాస్ తరపున దుస్తులు, వంటపాత్రలు సమకూర్చుతామని, ముఖ్యమంత్రి రిలీఫ్‌ఫండ్‌కు ప్రతిపాదిస్తామన్నారు. - సిలిండర్ లీకేజీ వల్లే ప్రమాదం శ్రీనివాసరెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, శ్రీకాకుళం సిలిండర్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి చెప్పారు.గాలి వీయడంతో ఇళ్లకు మంటలు త్వరగా వ్యాపించి కాలిపోయినట్టు పేర్కొన్నారు. ఓ ్రపయాణీకుని సమాచారంతో తక్షణమే ఘటనా స్థలికి చేరుకొని మంటలను తమ సిబ్బంది అదుపు చేశారన్నారు. -
ముగిసిన టేబుల్ టెన్నిస్ పోటీలు
వట్లూరు (పెదపాడు) : స్థానిక సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 3 నుంచి ప్రారంభమైన అంతరజిల్లాల టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. టెన్నిస్ అసోసియేషన్, సీఆర్ఆర్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. పురుషుల విభాగంలో విజేతగా విశాఖపట్నం, రన్నర్‌గా కృష్ణా జిల్లా జట్లు నిలిచాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా జట్లు సెమీస్ జట్లుగా నిలిచాయి. మహిళల విభాగంలో విన్నర్‌గా విశాఖపట్నం, రన్నర్‌గా కృష్ణా విజయం సాధించాయి. జూనియర్ బాలుర విభాగంలో విన్నర్‌గా కృష్ణా, రన్నర్‌గా విశాఖపట్నం సెమీ ఫైనల్ జట్లుగా పశ్చిమ, తూర్పు గోదావరి జట్లు నిలిచాయి. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలలో పాల్గొనేందుకు ఎంపిక చేశారు. -
జాతీయస్థాయి పోటీలకు విద్యార్థినుల ఎంపిక
పెదపాడు : మండలంలోని వట్లూరు సోషల్ వెల్ఫేర్ స్కూల్‌కు చెందిన విద్యార్థినులు జాతీయస్థాయి టెన్నిస్ వాలీబాల్, బేస్‌బాల్ క్రీడా పోటీలకు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ తాళ్లూరు ఉమాదేవి తెలిపారు. ఇటీవల కర్నూలు, పెదపాడుల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు ప్రతిభ చూపినట్టు చెప్పారు. టెన్నిస్ వాలీబాల్ జాతీయస్థాయి పోటీలకు ఎ.అజిత, వి.సంధ్యారాణి, ఎన్.ధనూశ్రీ, ఎం.శ్రావణి ఎంపికయ్యారని, బేస్‌బాల్ పోటీలకు పి.మృదుల, సీహెచ్ జ్యోత్సాS్నరాణి ఎంపికైనట్టు తెలిపారు. -
యువకుడి ఆత్మహత్య
ఏలూరు అర్బన్: పెదపాడు మండలానికి చెందిన యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. పెదపాడు మండలం వట్లూరు పంచాయతీ శౌరిపురం గ్రామానికి చెందిన బొబ్బిలి రాయప్ప, చంటి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి కుమారుడు వినోద్‌కుమార్ (25) డిగ్రీ వరకూ చదువుకుని కొంతకాలంగా ఏలూరులోని ఓ వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం వినోద్‌కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుమందు తాగాడు. దీనిని గమనించిన ఇరుగుపొరుగు వారు తల్లిదండ్రులకు సమాచారం అందించి బాధితుడ్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా వినోద్‌కుమార్ మతి చెందాడు. -
గర్భిణిపై టీనేజర్ల అఘాయిత్యం
మైనర్ బాలుడు సహా ముగ్గురు టీనేజర్లు గర్భిణిపై సామూహిక లైంగికదాడికి పాల్పడి, ఘటన మొత్తాన్నీ సెల్ఫోన్లో చిత్రీకరించారు. పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో అత్యంత జుగుప్సాకర రీతిలో సాగిన ఈ దారుణకాండ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం గ్రామంలో శనివారం ఉదయం బాధితురాలు నివసిస్తోన్న ఇంట్లోకి ముగ్గురు టీనేజర్లు ప్రవేశించారు. ఇద్దరు ఆమెపై దాడి చేస్తుండగా ఆ దృశ్యాలను మైనర్ బాలుడు ఫోన్లో చిత్రీకరించాడు. కొద్దిసేపటి తర్వాత పెదపాడు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బాధితురాలు.. జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదుచేసింది. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసుకుని నిందితులకోసం గాలిస్తున్నామని ఏలూరు డీఎస్సీ సరిత చెప్పారు. పెదపాడు ఎస్ఐ విజయ్ కుమార్ నేతృత్వంలో నిందితులకోసం గాలిపుచర్యలు చేపట్టారు. -
తానా సేవలు భేష్
పెదపాడు : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సేవలు అభినందనీయమని శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. శనివారం హనుమాన్‌జంక్షన్‌లోని లయన్స్ క్లబ్ కల్యాణ మండపంలో తానా సభ్యులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో తానా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తానా ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు వేలాదిగా నిర్మించారన్నారు. 37 ఏళ్లుగా తెలుగు ప్రజల అభివృద్ధికి తానా కృషి చేస్తుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మాగంటి రాంజీ, హనుమాన్ జంక్షన్ లయన్స్‌క్లబ్ ఫౌండర్, అధ్యక్షుడు డాక్టర్ కడియాల రామారావు తదితులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా సీనియర్ జర్నలిస్టు తాడి రంగారావును లయన్స్ సభ్యులు సన్మానించారు. వైద్యశిబిరం ఆదివారం కూడా కొనసాగుతుందని తానా కార్యదర్శి గోగినేని శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 29న పెదవేగి మండలంలోని విజయరాయిలో లయన్స్‌క్లబ్ ఆఫ్ ఏలూరు-హేలాపురి, తానా సంయుక్త ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. -
రైతుల ఆత్మహత్యలు డబ్బు కోసమే అన్నారు
పెదపాడు, న్యూస్‌లైన్ : ‘పంటలు దెబ్బతినడంతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చం ద్రబాబు అప్పట్లో హేళన చేశారు. ఈ విషయూల్ని ప్రజలెవరూ మర్చిపోలేదు. ఇప్పుడు చంద్రబాబు, టీడీపీ నేతలు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ నిలదీశారు. పెదపాడు మండలం కొత్తూరులో దెందులూరు ఎమ్మెల్యే అ భ్యర్థి కారుమూరి నాగేశ్వరావుతో కలసి మంగళవారం ఆయన ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీబొమ్మ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి చంద్రశేఖర్ మాట్లాడారు. మే 7వ తేదీన మహా సంగ్రామంజరగబోతోందని, ప్రజల తలరాతల్ని మార్చే వజ్రాయుధం వారి చేతుల్లోనే ఉందని ఆయన పేర్కొన్నారు. మేలు చేసే నాయకులెవరో ఆలోచించి మంచి అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. చాలా గ్రామాల్లో అర్హులైన వారికి నేటికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ఈ విషయంపై గత పాలకులను నిలదీయాలని సూచించారు. ఆ హక్కును ప్రజలకు రాజ్యాంగం కల్పించిందన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశాడో టీడీపీ నాయకులను నిలదీయూలన్నారు. తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఉన్న ప్రజలపై పన్నుల భారం పెంచి వారి నడ్డివిరిచిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. తుపాకులతో రైతులను కాల్పించిన మహానుభావుడు, అంగన్వాడీ కార్యకర్తలు జీతాలు పెంచాలని ధర్నా చేస్తే గుర్రాలతో తొక్కించిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడు కూడా ఆయనేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తే.. ధరను రూ.5.25కి పెంచి పేదల నోటికాడ కూడు లాక్కున్నాడని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు చేస్తే చంద్రబాబు బెల్ట్ షాపులు పెట్టించి మధ్యాన్ని ఏరులై పారించాడని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులుగా, ప్రతినిధులుగా ఓటు అడిగే హక్కు తమకే ఉందన్నారు. రాజశేఖరరెడ్డి హయూంలో ప్రత్యక్షంగా.. పరోక్షంగా అన్నివర్గాల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరిందని వివరించారు. వైఎస్సార్ హయాంలో లబ్ధి పొందిన వారంతా ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. మహిళలకు రూ.78 లక్షల కోట్లను వైఎస్ రుణాలుగా ఇచ్చారని, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతోపాటు రూ.11 వేల కోట్ల రుణాలను రద్దు చేశారన్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించిన ఘనత వైఎస్‌దేనని చెప్పారు. దెందులూరు నియోజకవర్గంలో సాగునీరు, తాగునీటి సమస్యలను తీర్చే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.17 వేల కోట్ల నిధులను వైఎస్ కేటాయించారని గుర్తు చేశారు. ఆయన వారసుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద, మధ్య తరగతి ప్రజలందరికీ ఉపయోగపడేలా అనేక పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచారని వివరించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేయనున్నారని తెలిపారు. ఏ కార్డు కావాలన్నా 24 గంటల్లో గ్రామంలోనే అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పేదలకు రూ.వందకే 150 యూనిట్ల విద్యుత్, ఏటా 10 లక్షల ఇళ్లు, ప్రతి జిల్లాకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వంటి కార్యక్రమాలను చేపడతామని వివరించారు. దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో తణుకు నుంచి పోటీ చేయూలని వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదేశించారని, ఆయన ఆశీస్సులతో ఆ నియోజకవర్గాన్ని రూ.600 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్పారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దెందులూరు నియోజకవర్గానికి తనను పంపించారని, ఇక్కడి ప్రజలకు సేవ చేయూలని ఆదేశించారని అన్నారు. దెందులూరు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో తాను తిరిగానని చాలాచోట్ల పిడికెడు మట్టితో రోడ్లు కూడా వేయలేదని పేర్కొన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.మాజీమంత్రి మరడాని రంగారావు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు ఘంటా ప్రసాదరావు, ఊదరగొండి చంద్రమౌళి, ముంగర సంజీవకుమార్, యువజన నాయకులు ఆళ్ల సతీష్ చౌదరి, అక్కినేని రాజశేఖర్, గొట్టాపు నరసింహరావు, కత్తుల రవికుమార్ పాల్గొన్నారు. -
సొమ్ముకొట్టు.. పన్ను ఎగ్గొట్టు
పెదపాడు, న్యూస్‌లైన్ : గ్రామాల్లో ఇంటి పన్నుల విధింపు వ్యవహారం అధికారులకు సొమ్ములు కురిపిస్తోంది. పంచాయతీల ఆదాయానికి తూట్లు పొడుస్తోంది. శాస్త్రీయ విధానం పాటించకుండా ఎవరికి తోచినట్లు వారు పన్నుల విధిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు చెందిన ఇళ్లకు పూర్తిస్థారుులో పన్నులు విధిస్తున్నా.. వ్యాపార సంస్థలు, బడా బాబులకు చెందిన కట్టడాలపై మాత్రం కరుణ చూపిస్తూ పంచాయతీ ఆదాయూనికి గండి కొడుతున్నారు. దీనివల్ల జిల్లాలోని పంచాయతీలకు ఏటా కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లుతోంది. విధానమిదీ.. పన్నులు విధించే సందర్భంలో ఇల్లు లేదా సంబంధిత కట్టడం విస్తీర్ణాన్ని చదరపు అడుగులలో లెక్కించాలి. ఇంటిస్థలం విలువను ప్రభుత్వ నిర్దేశించిన ధరలను పరిగణనలోకి తీసుకోవాలి. దానికి భవన నిర్మాణానికి చేసిన వ్యయం కలిపి ఆ మొత్తంలో 2 శాతం ఇంటి పన్ను వేయాలి. గుడిసెల్లో ఉండేవారికి.. చిన్నపాటి పెంకుటిళ్లలో ఉండేవారికి సక్రమంగానే పన్నులు విధిస్తున్నా.. డాబాలు బహుళ అంతస్తులు గల భవనాలకు మాత్రమే సక్రమంగా పన్ను విధించడం లేదు. ఇంటిపన్ను మదింపు విధానాన్ని 20 ఏళ్ల క్రితం మదింపు చేశారు. దాని ఆధారంగా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏటా 5 శాతం ఇంటిపన్ను పెంచాల్సి ఉంటుంది. 2000 చదరపు అడుగుల ఇంటికి సైతం కేవలం రూ,500నుండి రూ.1,500లోపు పన్ను విధించడం వల్ల పంచాయతీల ఆదాయం భారీగా పడిపోతోంది. కట్టడం రకాన్ని బట్టి పన్ను నిర్ణయించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా సాగుతోంది. గుడిసె, పెంకుటిల్లు, రేకుల స్లాబ్, డూప్లెక్స్, మల్టీస్టోర్డ్ (బహుళ అంతస్తుల) బిల్డింగ్‌లలో ఒక్కొక్క దానికి ఒక్కోరకంగా పన్ను విధించాల్సి ఉంది. కమ్యూనిటీ హాల్స్, కల్యాణ మండపాలు, సినిమా హాల్స్, రెస్టారెంట్లు, హోటళ్లు, విద్యాసంస్థలకు మరో రకమైన పన్ను విధానాన్ని అవలంభిస్తారు. జిల్లాలో ఎక్కడా ఇలా చేయడం లేదు. అన్నిటికీ ఒకటే పన్ను వ్యాపారాలు నిర్వహించే భవనాలు, ప్రైవేటు విద్యాసంస్థలు, కల్యాణ మండపాలు, కార్పొరేట్ సంస్థలకు వర్గీకరణతో సంబంధం లేకుండా అన్నిటికీ ఒకే తరహా పన్ను విధిస్తున్నారు. భవన యజమానులిచ్చే కాసులకు కక్కుర్తిపడి పంచాయతీల ఆదాయూనికి గండికొడుతున్నారు. ఉదాహరణకు పెదపాడు మండలం లోని వట్లూరులో ఒక ఏసీ కల్యాణ మండపం ఉంది. దీని ఒకరోజు అద్దె రూ.లక్ష వసూలు చేస్తున్నారు. దీనికి ఏడాదికి రూ.59,030 మాత్రమే పన్ను వేశారు. నాయుడుగూడెంలో ఓ బహుళ అంతస్తుల భవనం ఉంది. ఇందులో ఓ బ్యాంకు, ఇతర వ్యాపార సంస్థలు నడుస్తున్నారుు. దీనికి కేవలం రూ.1,500 మాత్రమే పన్ను వేశారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఓ భవనానికి సంవత్సరానికి వచ్చే అద్దెలో 90రోజుల అద్దెను పన్నుగా విధించాలి. మండలంలోని అప్పనవీడు, ఏపూరు పరిధిలో గల షాపింగ్ కాంప్లెక్సులలో ఒక్కొక్క షాపు నుంచి నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ అద్దె వసూలు చేస్తున్నారు. రూ.10వేలు అద్దె వస్తున్న షాపునకు రూ.30వేలు పన్ను చెల్లిం చాలి. కానీ.. వారినుంచి వసూలు చేస్తున్నది రూ.వెరుు్య నుంచి రూ.2 వేలలోపు మాత్రమే. దీనివల్ల పంచాయతీలకు కోట్లాది రూపాయల ఆదాయ నష్టం వాటిల్లుతోంది. దీంతో గ్రామా ల్లో అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ పనులు కుం టుపడుతున్నారుు. కొన్నిచోట్ల సిబ్బందికి జీతా లు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. పట్టించుకోని ఈవోపీఆర్డీలు పన్నుల సవరణ సందర్భంలో ఇంటి ఫొటో తీ రుుంచాలి. ఇంటి విస్తీర్ణాన్ని శాస్త్రీయంగా లెక్కగట్టిన తరువాత వాటిని తనిఖీ చేయూల్సిన బాధ్య త ఈవోపీఆర్డీలదే. అనంతరం వాటిని డీఎల్పీవోలకు అప్పగించాలి. ఈ తంతు ఎక్కడా జరగడం లేదు. ఉన్నతాధికారులు సిబ్బంది లేరనే సాకుతో పన్నుల సవరణ చేయడం లేదు. గ్రామ కార్యదర్శుల సహకారంతో చేపట్టే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు.