పెదపాడు: పెదపాడు మండలం నాయుడు గూడెంలో మే 16న జరిగిన కొల్లి మోహన్ హత్య కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తన భార్య భార్గవితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కొల్లి నాగమోహన్ అనే వ్యక్తిని భార్గవి భర్త బేతపూడి ఉదయకుమార్ మరో ముగ్గురితో కలిసిన మే 16న దారుణంగా హత్య చేశారు. ఏలూరులో డీఎస్పీ జి. వెంకటేశ్వరరావు, ఏలూరు రూరల్ సీఐ ఏఎన్ మురళి, పెద్దపాడు ఎస్‌ఐ కె.రామకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు.