గర్భిణిపై టీనేజర్ల అఘాయిత్యం | Teenagers rape pregnant woman, record the whole act | Sakshi
Sakshi News home page

గర్భిణిపై టీనేజర్ల అఘాయిత్యం

Published Sun, May 3 2015 7:34 PM | Last Updated on Tue, Aug 28 2018 7:08 PM

Teenagers rape pregnant woman, record the whole act

మైనర్ బాలుడు సహా ముగ్గురు టీనేజర్లు గర్భిణిపై సామూహిక లైంగికదాడికి పాల్పడి, ఘటన మొత్తాన్నీ సెల్ఫోన్లో చిత్రీకరించారు.  పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో  అత్యంత జుగుప్సాకర రీతిలో సాగిన ఈ దారుణకాండ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం గ్రామంలో శనివారం ఉదయం బాధితురాలు నివసిస్తోన్న ఇంట్లోకి ముగ్గురు టీనేజర్లు ప్రవేశించారు. ఇద్దరు ఆమెపై దాడి చేస్తుండగా ఆ దృశ్యాలను మైనర్ బాలుడు ఫోన్లో చిత్రీకరించాడు.

కొద్దిసేపటి తర్వాత పెదపాడు పోలీస్ స్టేషన్కు చేరుకున్న బాధితురాలు.. జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదుచేసింది. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసుకుని నిందితులకోసం గాలిస్తున్నామని ఏలూరు డీఎస్సీ సరిత చెప్పారు. పెదపాడు ఎస్ఐ విజయ్ కుమార్ నేతృత్వంలో నిందితులకోసం గాలిపుచర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement