తానా సేవలు భేష్ | Telugu Association of North America Services Whisht | Sakshi
Sakshi News home page

తానా సేవలు భేష్

Published Sun, Dec 28 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

Telugu Association of North America Services Whisht

పెదపాడు : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సేవలు అభినందనీయమని శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. శనివారం హనుమాన్‌జంక్షన్‌లోని లయన్స్ క్లబ్ కల్యాణ మండపంలో తానా సభ్యులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో తానా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తానా ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు వేలాదిగా నిర్మించారన్నారు. 37 ఏళ్లుగా తెలుగు ప్రజల అభివృద్ధికి తానా కృషి చేస్తుండడం అభినందనీయమన్నారు.
 
 ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మాగంటి రాంజీ, హనుమాన్ జంక్షన్ లయన్స్‌క్లబ్ ఫౌండర్, అధ్యక్షుడు డాక్టర్ కడియాల రామారావు తదితులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా సీనియర్ జర్నలిస్టు తాడి రంగారావును లయన్స్ సభ్యులు సన్మానించారు. వైద్యశిబిరం ఆదివారం కూడా కొనసాగుతుందని తానా కార్యదర్శి గోగినేని శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 29న పెదవేగి మండలంలోని విజయరాయిలో లయన్స్‌క్లబ్ ఆఫ్ ఏలూరు-హేలాపురి, తానా సంయుక్త ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement