మునిగానంటూ ముంచాడు | lot Irregularities done... | Sakshi

మునిగానంటూ ముంచాడు

Mar 30 2014 3:58 AM | Updated on Sep 2 2017 5:20 AM

అతనెన్నో అక్రమాలు చేశాడు. అందినకాడికి దోచుకున్నాడు. అయినా దర్జాగా తిరుగుతున్నాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా మిన్నకుం డిపోవడంతో ఆ నాయకుని ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.

కొండాపురం, న్యూస్‌లైన్: అతనెన్నో అక్రమాలు చేశాడు. అందినకాడికి దోచుకున్నాడు. అయినా దర్జాగా తిరుగుతున్నాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు  తెలిసినా మిన్నకుం డిపోవడంతో ఆ నాయకుని ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. వివరాల్లోకి వెళితే.. కొండాపురం మండలంలోని బుక్కపట్నం సర్పంచ్ చెక్కా పెద్దఓబుళరాజు (అలియాస్ పెద్దిరాజు) గండికోట డ్యాం ముంపు పరిహారంలో చేతి వాటం ప్రదర్శించాడు.
 
 మొత్తం 28ఎకరాల ఒక్కసెంటు విస్తీర్ణంలో గల  ప్రభుత్వ భూమిని చెక్కా పెద్దఓబుళరాజుతోపాటు, అతని భార్య చెక్కా ఓబుళమ్మ , చెల్లెలు సి.రత్నమ్మ భర్త గోపాల్, తల్లి చెక్కా ఓబుళమ్మ భర్త పెద్ద ఓబన్న, చెల్లెలు సి.కాంతమ్మ భర్త రామచంద్రుడు, మరోచెల్లెలు దాసరి లక్ష్మిదేవి భర్త క్రిష్ణయ్య, కుమార్తె చెక్కాజయలక్ష్మి పేర్లతో నకిలీ పట్టాదార్ పాస్‌పుస్తకాలను తయారు చేయించాడు. ఈ భూముల్లో ఉన్నవి లేనివి తోటలు, వృక్షాలు కూడా సృష్టించాడు. ఆ విధంగా ఆ భూములు, చె ట్లు గండికోట డ్యాం ముంపునకు గురైనట్లుగా చూపించాడు. ఇలా అక్రమంగా సుమారు రూ.2,77,8391  పరిహారాన్ని స్వాహా చేశాడు.
 
 ఈ విషయంలో కడపకు చెందిన భూసేకరణ విభాగం స్పెషల్ కలెక్టర్ హెచ్.గోపీనాథ్,  ముద్దనూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు సుధాకర్‌రెడ్డి, మునిరాజులు, ఎస్‌డీటీ కె.వి.కోమల, వీరితోపాటు అప్పటి ఉద్యానవనశాఖ సహాయ సంచాలకుడు వి.ఎస్.ధర్మజ, డివిజినల్ అటవీశాఖ అధికారి ఎ.ప్రభాకర్ రావు ప్రమేయమున్నట్లు లోకాయుక్త ఎదుట తేలింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి 2014 ఫిబ్రవరి 12వ తేదీన తీర్పును వెలువరించారు. వెంటనే సదరు వ్యక్తులపై క్రిమినల్ చర్య తీసుకోవడమేకాకుండా, పరిహా రంగా కాజేసిన మొత్తం సొమ్మును రికవరీ చేయాలని జిల్లా అధికార్లను ఆదేశించారు. గతంలో కొండాపురం ఎమ్మార్వోగా పనిచేసిన ఎస్.నరసింహారెడ్డి జమ్మలమడుగు ఆర్డీఓ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు కూడా రుజువైంది.

 కలెక్టర్ కోన శశిధరే స్వయంగా లోకాయుక్తకు 2014 ఫిబ్రవరి 11వ తేదీన ధ్రువీకరిస్తూ నివేదించారు. దాదాపు నెలన్నర కావస్తున్నా పెద్దిరాజునుంచి ఒక్కపైసా కూడా వసూలు చేయలేదు. అంతేగాక ఏడాది కిందట గ్రామంలో కల్తీపాలు తయారుచేసి డైరీ పాలలో కలుపుతున్న కేసులో కూడా చట్టంలోని లొసుగులతో, కొందరు స్వార్థపరుల సహకారంతో తప్పించుకొన్నట్లు సమాచారం. చెక్కా పెద్దఓబుళరాజుకు ముగ్గురు సంతానం(1995 తర్వాత) ఉన్నా ఎన్నికల నియమావళిని ధిక్కరించి 8 నెలలుగా బుక్కపట్నం సర్పంచుగా కొనసాగుతున్నారు. అదీచాలదన్నట్లుగా ప్రస్తుతం తన భార్య చెక్కాబుళమ్మను తెలుగుదేశంపార్టీ తరపున కొండాపురం జెడ్పీటీసీకి పోటీలో నిలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement