
పశ్చిమగోదావరి ,తాడేపల్లిగూడెంరూరల్ : సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా విజయోత్సవ సంబరాల్లో భాగంగా చిత్రంలో సహనటులు శనివారం మండలంలోని లింగారాయుడిగూడెం గ్రామంలో హల్‌చల్ చేశారు. మహర్షి చిత్రంలో వివిధ పాత్రల్లో నటించిన దిల్ రమేష్, గురుస్వామి, ఇ.వెంకటేశ్వరరావు, వేమూరి పరమేశ్వరశర్మ, సీనియర్ జర్నలిస్ట్, రైతు ఆర్‌వీ రమణ, ఎల్.రమేష్‌నాయుడు, వి.రామ్మోహన్‌రావు, వెంకట్రావు, డి.సుబ్బరాజు గ్రామంలో పర్యటించిన వారిలో ఉ న్నారు. గ్రామంలోని పంట పొలాల్లో వీరు కలియతిరిగారు. ఈసందర్భంగా రైతులతో సమావేశమయ్యారు. మహేష్‌బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు సింగం సుబ్బారావు, సింగం జగన్, సభ్యులు, గ్రామ రైతులు మిద్దే సత్యనారాయణ, మైనం వెంకటేశ్వరరావు ఉన్నారు.
భూమిని నమ్ముకోవాలి.. అమ్ముకోకూడదు
మహర్షి సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో నటిం చాను. నిజ జీవితంలో కూడా జర్నలిస్ట్‌గా పని చేసి అలసిపోయి 2014లో నా వృత్తికి రాజీ నామా చేశాను. స్వతహాగా రైతు కుటుంబం కావడంతో తిరిగి రైతుగా అడుగుపెట్టాను. మహర్షి సినిమాలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. నేడు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రభుత్వాలు గిట్టుబాటు ధరపై ఆలోచన చేయాలి. రైతు లేకపోతే సమాజం లేదు. రైతు పండించడం మానేస్తే ఆహార సంక్షోభం వస్తుంది. ఒకడికి తిండి పెట్టగలిగే వాడు రైతు. అటువంటి రైతు భూమిని నమ్ముకోవాలి తప్ప అమ్ముకోకూడదు.-ఆర్‌వీ రమణ, సీనియర్ జర్నలిస్ట్, తూ.గో.జిల్లా
మహర్షిలో నటించడం అదృష్టం
కర్నూలు జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించా ను. ఉద్యోగరీత్యా భీమవరంలో కొన్నాళ్లు పని చేశాను. షార్ట్‌ఫిల్మ్‌లో నన్ను చూసి మహర్షి సిని మాకు ఎంపిక చేశారు. ఈ సినిమా పుణ్య మాంటూ గోదావరి జిల్లాలకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాలోని ఒక సన్ని వేశం నన్ను బాధ కలిగించినా అనుభవాన్నిచ్చింది. సామాన్యుడిగా ఉన్న నన్ను గోచి, తువాలు ఇచ్చి కట్టుకోమన్నారు. యూనిట్ అం తా భోజనాలు చేస్తున్న సందర్భంలో నేను అక్కడకు వెళ్లగా టోకెన్ తెచ్చుకోవాలని చెప్పడంతో బాధ కలిగింది. డైరెక్టర్ చెప్పడంతో నా కు భోజనం పెట్టారు. – గురుస్వామి, రైతు పాత్రధారి, మహర్షి సినిమా
189 చిత్రాల్లో నటించా..
రైతు పడుతున్న ఇబ్బందులపై సినిమా తీ యడం శుభపరిణామం. నేను ఇప్పటివరకు 189 చిత్రాల్లో నటించాను. మహర్షి సినిమాలో నేను ఒక పాత్ర ధరించడం అదృష్టంగా భావిస్తున్నాను. రైతు పడుతున్న ఇబ్బందులే సినిమాల ద్వారా ప్రపంచానికి తెలియపరుస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి రైతాంగాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి. మహర్షి సినిమా చూసిన విదేశాల్లోని వారు సైతం వీకెండ్ వ్యవసాయం చేయడానికి హైదరాబాద్, పరిసరాల్లో అరెకరం, ఎకరం పొలం కోసం తాపత్రయపడటం గర్వించదగ్గ విషయం.– దిల్ రమేష్, మహర్షి సినిమా పాత్రధారి
Comments
Please login to add a commentAdd a comment