సాక్షి, కాకినాడ సిటీ: అవనిలో సగం, ఆకాశంలో సగం అంటూ దూసుకెళ్తున్న మహిళలు ఇప్పుడు చట్టసభల్లో పాలకులను నిర్ణయించే నారీశక్తిగా అవతరించారు. ఓటు హక్కు నమోదులోనూ, వినియోగంలోనూ మహిళ ముందంజలో ఉంది. జిల్లాలో అత్యధిక ఓట్ల శాతాన్ని నమోదు చేసుకున్న నారీమణులు గురువారం (11వ తేదీన) జరగనున్న ఎన్నికల్లో న్యాయ నిర్ణేతలుగా ఉండబోతున్నారు. జిల్లాలో 19 నియోజక వర్గాలుంటే 13 నియోజకవర్గాల్లో మహిళలు అత్యధికంగా ఉన్నారు. జిల్లాలో ఓటర్లు 42,04,436 మంది ఉం డగా వీరిలో పురుషులు 20,80,751 మంది, మ హిళలు 21,23,332 మంది ఓటర్లు ఉన్నారు. అంటే మహిళల సంఖ్య పురుషులు కంటే 42,581 మంది అధికంగా ఉన్నారు.
నియోజకవర్గం మహిళా ఓటర్లు
తుని 1,124
ప్రత్తిపాడు 1,387
పెద్దాపురం 1,625
అనపర్తి 3,052
కాకినాడ సిటీ 9,080
రామచంద్రపురం 311
రాజోలు 778
కొత్తపేట 330
మండపేట 4,620
రాజానగరం 1,421
రాజమహేంద్రవరం రూరల్ 4,973
రాజమహేంద్రవరం సిటీ 8,462
జగ్గంపేట 1,352
రంపచోడవరం 10,855
Comments
Please login to add a commentAdd a comment