mahila voters
-
పేద మహిళలకు ఏటా రూ. లక్ష
ధులే: ఐదురకాల హామీలతో యువతకు ‘యువ న్యాయ్’ పేరిట ఎన్నికల వరాలు ప్రకటించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం పేద మహిళల కోసం ప్రత్యేకంగా ‘మహిళా న్యాయ్’ పేరిట హామీలను ఇచ్చారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే పేద మహిళలకు ఏటా రూ.1 లక్ష అందజేస్తామని, వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్ అమలుచేస్తామని ప్రకటించారు. 50 శాతం రిజర్వేషన్ పరిమితిని రాజ్యాంగ సవరణ ద్వారా తొలగిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ చెప్పారు. బుధవారం మహారాష్ట్రలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ధులే జిల్లాలో జరిగిన మహిళా ర్యాలీలో ఐదు ‘మహిళా న్యాయ్’ గ్యారెంటీలను రాహుల్ ప్రకటించారు. ‘ ఏటా పేద మహిళలకు రూ.1 లక్ష వారి బ్యాంక్ ఖాతాలో జమచేస్తాం. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకం, చైల్డ్ కేర్ సెంటర్లలో పనిచేసే మహిళా సిబ్బందికి అందే వేతనంలో కేంద్రం తరఫు బడ్జెట్‌ను రెట్టింపు చేస్తాం. మహిళా సమస్యల పరిష్కారానికి, తమ హక్కుల పట్ల మహిళల్లో అవగాహన పెంపునకు నోడల్ అధికారిని నియమిస్తాం. దేశంలో ప్రతీ జిల్లాలో సావిత్రిబాయ్ ఫూలే హాస్టళ్లను నెలకొల్పుతాం’’ అని హామీలు ఇచ్చారు. ‘‘ మోదీ సర్కార్ మహిళలను మహిళా రిజర్వేషన్ చట్టం పేరిట ఎగతాళి చేసింది. ఆర్భాటంగా చట్టం చేసింది. కానీ పదేళ్ల తర్వాతే దానిని అమలుచేస్తారట. మేం అధికారంలోకి వస్తే తక్షణం చట్టాన్ని అమలుచేస్తాం’ అని రాహుల్ అన్నారు. -
నారీమణులే న్యాయ నిర్ణేతలు
సాక్షి, కాకినాడ సిటీ: అవనిలో సగం, ఆకాశంలో సగం అంటూ దూసుకెళ్తున్న మహిళలు ఇప్పుడు చట్టసభల్లో పాలకులను నిర్ణయించే నారీశక్తిగా అవతరించారు. ఓటు హక్కు నమోదులోనూ, వినియోగంలోనూ మహిళ ముందంజలో ఉంది. జిల్లాలో అత్యధిక ఓట్ల శాతాన్ని నమోదు చేసుకున్న నారీమణులు గురువారం (11వ తేదీన) జరగనున్న ఎన్నికల్లో న్యాయ నిర్ణేతలుగా ఉండబోతున్నారు. జిల్లాలో 19 నియోజక వర్గాలుంటే 13 నియోజకవర్గాల్లో మహిళలు అత్యధికంగా ఉన్నారు. జిల్లాలో ఓటర్లు 42,04,436 మంది ఉం డగా వీరిలో పురుషులు 20,80,751 మంది, మ హిళలు 21,23,332 మంది ఓటర్లు ఉన్నారు. అంటే మహిళల సంఖ్య పురుషులు కంటే 42,581 మంది అధికంగా ఉన్నారు. నియోజకవర్గం మహిళా ఓటర్లు తుని 1,124 ప్రత్తిపాడు 1,387 పెద్దాపురం 1,625 అనపర్తి 3,052 కాకినాడ సిటీ 9,080 రామచంద్రపురం 311 రాజోలు 778 కొత్తపేట 330 మండపేట 4,620 రాజానగరం 1,421 రాజమహేంద్రవరం రూరల్ 4,973 రాజమహేంద్రవరం సిటీ 8,462 జగ్గంపేట 1,352 రంపచోడవరం 10,855 -
మహిళా ఓటర్లకు గాలం
బోధన్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు అధిక్యత సాధించే దిశలో అన్ని అస్త్రాలను సందిస్తున్నారు. అందరి దృష్టి మహిళా ఓటర్లపై పడింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బోధన్ నియోజక వర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో వైపు మహిళా ఓటర్ల ఆశీస్సుల కోసం ఆరాటపడుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన మహిళా సంక్షేమ పథకాలను వల్లెవేస్తున్నారు. మహిళలను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు భార్యలు కూతుర్లు ఎన్నికల ప్రచార రంగంలో దించారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటికి వెళ్లి బొట్టుపెట్టి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అందరి దృష్టి మహిళా ఓటర్లపై మళ్లీంది. నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అధికం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య లక్షా 97,389 మంది ఉండగా, ఇందులో లక్షా 11,179 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మహిళల ఆశీస్సు లు పొందకలిగితే గెలుపు సునాయసం అవుతుం దని ప్రధాన రాజకీయ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు అంచన వేస్తున్నారు. క్రమ పద్ధతిలో సంఘటితంగా ఉన్న డ్వాక్రా సంఘాలకు గాలం వేసేందుకు ఆయా రాజకీయ పార్టీల మండల నాయకులు పావులు కదువుపుతున్నారు. ప్రలోబాలకు గురి చేసే అవకాశాలున్నాయి. మహిళలు కూడా రాజకీయ చతురత ప్రదర్శించే అవకాశాలున్నాయి. అన్ని పార్టీలకు సరే అంటునే, తమ విజ్ఞతో ఓటు వేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎవరిని ఓటు వేయమన్నా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుందని, అందరికి సరే అని తమ పని తాము కానిచ్చేస్తే అయిపోతోందని మహిళల్లో అభిప్రాయం వ్యక్తం అవుతుంది.