మహిళా ఓటర్లకు గాలం
బోధన్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు అధిక్యత సాధించే దిశలో అన్ని అస్త్రాలను సందిస్తున్నారు. అందరి దృష్టి మహిళా ఓటర్లపై పడింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బోధన్ నియోజక వర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో వైపు మహిళా ఓటర్ల ఆశీస్సుల కోసం ఆరాటపడుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన మహిళా సంక్షేమ పథకాలను వల్లెవేస్తున్నారు. మహిళలను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు భార్యలు కూతుర్లు ఎన్నికల ప్రచార రంగంలో దించారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటికి వెళ్లి బొట్టుపెట్టి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అందరి దృష్టి మహిళా ఓటర్లపై మళ్లీంది.
నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అధికం
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య లక్షా 97,389 మంది ఉండగా, ఇందులో లక్షా 11,179 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
మహిళల ఆశీస్సు లు పొందకలిగితే గెలుపు సునాయసం అవుతుం దని ప్రధాన రాజకీయ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు అంచన వేస్తున్నారు. క్రమ పద్ధతిలో సంఘటితంగా ఉన్న డ్వాక్రా సంఘాలకు గాలం వేసేందుకు ఆయా రాజకీయ పార్టీల మండల నాయకులు పావులు కదువుపుతున్నారు. ప్రలోబాలకు గురి చేసే అవకాశాలున్నాయి. మహిళలు కూడా రాజకీయ చతురత ప్రదర్శించే అవకాశాలున్నాయి. అన్ని పార్టీలకు సరే అంటునే, తమ విజ్ఞతో ఓటు వేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎవరిని ఓటు వేయమన్నా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుందని, అందరికి సరే అని తమ పని తాము కానిచ్చేస్తే అయిపోతోందని మహిళల్లో అభిప్రాయం వ్యక్తం అవుతుంది.