ఆంధ్రప్రదేశ్
► నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
► కర్నూలులో విద్యార్థులు, ప్రజాసంఘాలు, న్యాయవాదులు నేడు మనవహారాలు, ర్యాలీలకు పిలుపునిచ్చారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును అడ్డుకోవద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
► ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా ఎంఐఎం ఆధ్వర్యంలో నేడు నిజామాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, వామపక్ష నేతలు హాజరుకానున్నారు.
► మున్సిపల్ ఎన్నికలపై నేడు ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొననున్నారు.
► నేడు హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ భేటీ జరగనుంది. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికలపై చర్చించనున్నారు.
► ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నేడు సమత కేసు విచారణ సాగనుంది. న్యాయస్థానం ఈ రోజు ఐదుగురు సాక్ష్యులను విచారించనుంది.
భాగ్యనగరంలో నేడు..
► కొత్త శ్రీనివాస్ క్యాలెండర్ ఆవిష్కరణ, వేదిక : సినీమ్యాక్స్, బంజారాహిల్స్, సమయం : సాయంత్రం 6 గంటలకు
► మై ప్లేదేట్ కార్నివాల్ ఎట్ హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్– 2019, వేదిక : హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, సమయం : ఉదయం 5.30 గంటలకు
► ది పాండిచ్చేరి హాలీడే, వేదిక : పబ్లిక్ గార్డెన్, హైదరాబాద్, సమయం : మధ్యాహ్నం 12 గంటలు
► ఫెంటాస్టిక్ ఫెస్టివ్ ,. కీమా ఫుడ్ ఫెస్టివల్, వేదిక : గ్లోకల్ జంక్షన్, జూబ్లీహిల్స్, సమయం: మధ్యాహ్నం 12 గంటలు
► పక్కా హైదరాబాద్, వేదిక : çపీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, సమయం : మధ్యాహ్నం 12 గంటలు
► హైదరాబాద్ బుక్ ఫెయిర్, వేదిక : ఎన్‌టిఆర్ స్టేడియం, ఇందిరా పార్క్ రోడ్, సమయం : రాత్రి 10 గంటల వరకు.
► రప్లెజ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్స్, వేదిక : రాజ్ కృష్ణా, బంజారాహిల్స్, సమయం : ఉదయం 9.00 గంటలకు
► బాజ్మ్ సుఖాన్ మొదటి వార్షికోవత్సం, వేదిక : లామకాన్, బంజారాహిల్స్, సమయం : సాయంత్రం 6 గంటలకు
Comments
Please login to add a commentAdd a comment