
వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ సభ్యులుగా మలికిరెడ్డి
వైఎస్ఆర్‌సీపీ కీలకనేత మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ సీఈసీ సభ్యులుగా నియమితులయ్యారు.
హైదరాబాద్: కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు (సీఈసీ మెంబర్)గా నియమితులయ్యారు. ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.