హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని మోసం చేసిన ఓ వ్యక్తిపై సోమవారం రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రవీందర్‌రెడ్డి కథనం ప్రకారం.. పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండే ఓ యువతి బాచుపల్లిలోని ఓ పరిశ్రమలో పనిచేస్తుంది. అదే పరిశ్రమల్లో పనిచేసే శేఖర్ సదరు యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు.
అనంతరం తన అన్న వివాహం పూర్తి కాగానే మన పెళ్లి అని నమ్మిస్తూ వచ్చాడు. అయితే నవంబర్‌లో శేఖర్ అన్న వివాహం కూడా అయ్యింది. నాటి నుంచి పెళ్లి చేసుకోమని యువతి శేఖర్‌పై ఒత్తిడి తెచ్చింది. అయితే శేఖర్ మాత్రం నువ్వు నాకు తెలియదని చె ప్పాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వ్యక్తిపై కేసు
Published Mon, Mar 3 2014 8:23 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement