లారీ ఢీకొని పురోహితుడి మృతి
Published Sat, Jan 2 2016 11:26 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
ముదినేపల్లి: మంచు ప్రభావంతో ఎదురుగా వస్తున్న లారీ కనిపించక ద్విచక్రవాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా ముదినేపల్లి సమీపంలోని చినపాలపర్రు వద్ద శనివారం చోటు చేసుకుంది. వడాలి గ్రామానికి చెందిన జంద్యాల శాస్త్రీ(42) పౌరోహిత్యం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఈ రోజు మరో వ్యక్తితో కలిసి బైక్ పై వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో జంధ్యాల శాస్త్రీ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
Advertisement
Advertisement