కడప: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప పోలీసుల అదుపులో ఉన్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని జెండామానువీధికి చెందిన టి.ప్రసాదరెడ్డి(50) అనే వ్యక్తిని ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఇటీవల కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అతడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. దీంతో మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. దీంతో ఆస్పత్రి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.