స్నానం చేస్తుండగా చిత్రీకరణ : వ్యక్తికి దేహశుద్ధి | Man held for video recording of bathing women | Sakshi
Sakshi News home page

స్నానం చేస్తుండగా చిత్రీకరణ : వ్యక్తికి దేహశుద్ధి

Published Fri, Aug 28 2015 3:05 PM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM

Man held for video recording of bathing women

తాడేపల్లి : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పొలకంపాడులో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పొలకంపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(48) అనే వ్యక్తి స్నానం చేస్తున్న యువతులను సెల్‌ఫోన్లతో చిత్రీకరించడంతోపాటు వారితో అసభ్యకరంగా మాట్లాడుతుండడంతో మహిళలు శుక్రవారం అతడిని పట్టుకుని చితక్కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడికి ఓ కుమార్తె, మనువడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement