
శ్రీపతిరాజు గెస్ట్‌హౌస్ ఉన్న తోట
విశాఖపట్నం, కోటవురట్ల(పాయకరావుపేట): ఎస్.రాయవరం మండలం గుడివాడకు చెందిన టీడీపీ నాయకుడు పేరిచర్ల శ్రీపతిరాజు కోటవురట్ల మండలం అల్లుమియ్యపాలేనికి సమీపంలో కొన్నేళ్ల క్రితం వందలాది ఎకరాలు కొనుగోలు చేశారు. జీడి, మామిడితో పాటు బొప్పాయి. అంతర పంటలు సాగుచేస్తున్నారు. మామిడి తోట చుట్టూ సోలార్ విద్యుత్‌తో పటిష్టమైన భద్రతా వలయం. లోపల అధునాతన గెస్ట్‌హౌస్. సామాన్యులకు ఇందులోకి ప్రవేశం ఉండదు. రాత్రి కాగానే వేటకుక్కలు మామిడి తోటలో పహారా కాస్తాయని పలువురు చెబుతుంటారు. రాత్రిళ్లు లోపలకు ప్రవేశించాలంటే ప్రాణాలపై ఆశ వదులుకోవడమే అంటారు. అక్కడ అంత రహస్యం ఏం ఉందో ఎవ్వరికీ అంతుబట్టని విషయం.
పనివారంతా పెళ్లికాని యువతులే...
ఈ ఫామ్‌హౌస్‌లో పనిచేసేవారంతా పెళ్లికాని యువతులే. వీరు తోటలో తిరిగేందుకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫామ్‌హౌస్‌లో పనిచేస్తారని స్థానికులు చెబుతుంటారు. ఇందులోకి టీడీపీ నేతలు, మంత్రులు, ఎమ్మేల్యేలకు మాత్రమే ప్రవేశం ఉంటుందనేది అందరికీ తెలిసిన సత్యం. శనివారం రాత్రి అటవీ అధికారుల దాడితో అసలు గుట్టు బయటపడింది. గెస్ట్‌హౌస్‌లో వన్యప్రాణులను పెంచుతున్నట్టు సమాచారం తెలుసుకున్న ఫారెస్టు రేంజర్ బీవీ రమణ సిబ్బందితో దాడి చేసి పలు వన్యప్రాణులను పట్టుకున్నారు. ఈ దాడిలో ఐదు కణుజులు, దుప్పి, నెమళ్లు, కొండగొర్రె పట్టుబడ్డాయి.
తోట యజమానిపై కేసు
వన్యప్రాణుల సంఘటనలో తోట యజమాని శ్రీపతిరాజుపై అటవీ వన్యప్రాణుల చట్ట కింద కేసు నమోదు చేస్తున్నాం. లొంగిపొమ్మని అతనికి నోటీసు జారీ చేశాం. లొంగిపోని ఎడల పోలీసుల సహకారంతో అతనిని అరెస్టు చేస్తాం.
– జి.శేఖర్‌బాబు, డీఎఫ్‌వో, నర్సీపట్నం
Comments
Please login to add a commentAdd a comment