
రావి, వేప చెట్టుకు పెళ్లి
గార్లదిన్నె అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురంలో బుధవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో వేప, రావి చెట్టుకు ఘనంగా పెళ్లి చేశారు.
ఒకే చోట ఉన్న రావి, వేప చెట్లకు పెళ్లి చేస్తే అంతా శుభం జరుగుతుందని గ్రామస్తుల నమ్మకం. ఐదేళ్ల క్రితం కూడా ఇలా చేసినట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలో పెళ్లి కాని యువతీయువకులు పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తే తొందరగా ఓ ఇంటివారవుతారని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం.
రెండు చెట్లకు పెళ్లి చేసిన అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో హోమం చేశారు. ఈ సందర్భంగా టీటీడీకి చెందిన భక్తబృందం భక్తి పాటలు ఆలపించింది. ఈ తంతుకు ఆపద్ధర్మ మంత్రి శైలజానాథ్ హాజరయ్యారు.