మర్రిపాలెం(విశాఖపట్నం), న్యూస్‌లైన్: స్టీల్ సిటీ విశాఖలో ఘోరం చోటు చేసుకుంది. కూలి పనులకోసం విశాఖ నగరానికి వచ్చిన ఓ గిరిజన మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. అడ్డుకున్న ఆమె భర్తను చితకబాదడమేగాక తాళ్లతో కట్టేసి.. అతని కళ్లెదుటే భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన విశాఖ నగరంలోని కంచరపాలెం దోబీఘాట్ ప్రాంతంలో గల పాత రైల్వే క్వార్టర్స్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. దంపతులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం వెలుగుచూసింది. బాధితులిచ్చిన ఫిర్యాదులో వివరాలివి. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం పాంగిమామిడి ప్రాంతానికి చెందిన ఓ గిరిజన దంపతులు గతేడాది కూలి పనులకోసం విశాఖపట్టణానికి వచ్చారు. గురువారం రాత్రి భోజనం అనంతరం ఇద్దరు పిల్లలతో భార్య(24) ఇంట్లో, భర్త మేడపై నిద్రపోయారు.
రాత్రి 11 గంటల సమయంలో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు రైల్వే క్వార్టర్స్‌కు వచ్చి భార్యపై అత్యాచారయత్నం చేశారు. ఆమె కేకలేయడంతో మేడపై నుంచి దిగిన భర్త.. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో వారు అతన్ని దారుణంగా చితకబాది తాళ్లతో కట్టిపడేశారు. అనంతరం భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటికి చెబితే చంపుతామంటూ బెదిరించి వెళ్లిపోయారు. ప్రాణభయంతో వణికిపోయిన దంపతులు అర్ధరాత్రి వేళ.. కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి దాడి, అత్యాచారం గురించి పోలీసులకు వివరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులకోసం గాలిస్తున్నారు.
గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం
Published Sat, Nov 2 2013 5:01 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement