Tribal woman gangraped
-
గిరిజన యువతిని కాటేసిన మానవ మృగాలు
చిత్తూరు: కామాంధుల ఘాతుకాలకు అంతు లేకుండా పోతోంది. కీచక సంతతి అకృత్యాలకు పుణ్యధరిత్రిలో అబల జీవితాలు బలైతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై ఘోరాలు కొనసాగుతూనే ఉన్నాయి. అబలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయి. మృగాళ్ల పశువాంఛకు పడతుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. చిత్తూరు జిల్లాలో గిరిజన యువతిపై నాలుగు మానవ మృగాలు సామూహిక మానభంగానికి తెగబడ్డాయి. పలమనేరు మండలం గూతలబండలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. -
గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం
మర్రిపాలెం(విశాఖపట్నం), న్యూస్‌లైన్: స్టీల్ సిటీ విశాఖలో ఘోరం చోటు చేసుకుంది. కూలి పనులకోసం విశాఖ నగరానికి వచ్చిన ఓ గిరిజన మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. అడ్డుకున్న ఆమె భర్తను చితకబాదడమేగాక తాళ్లతో కట్టేసి.. అతని కళ్లెదుటే భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన విశాఖ నగరంలోని కంచరపాలెం దోబీఘాట్ ప్రాంతంలో గల పాత రైల్వే క్వార్టర్స్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. దంపతులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం వెలుగుచూసింది. బాధితులిచ్చిన ఫిర్యాదులో వివరాలివి. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం పాంగిమామిడి ప్రాంతానికి చెందిన ఓ గిరిజన దంపతులు గతేడాది కూలి పనులకోసం విశాఖపట్టణానికి వచ్చారు. గురువారం రాత్రి భోజనం అనంతరం ఇద్దరు పిల్లలతో భార్య(24) ఇంట్లో, భర్త మేడపై నిద్రపోయారు. రాత్రి 11 గంటల సమయంలో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు రైల్వే క్వార్టర్స్‌కు వచ్చి భార్యపై అత్యాచారయత్నం చేశారు. ఆమె కేకలేయడంతో మేడపై నుంచి దిగిన భర్త.. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో వారు అతన్ని దారుణంగా చితకబాది తాళ్లతో కట్టిపడేశారు. అనంతరం భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటికి చెబితే చంపుతామంటూ బెదిరించి వెళ్లిపోయారు. ప్రాణభయంతో వణికిపోయిన దంపతులు అర్ధరాత్రి వేళ.. కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి దాడి, అత్యాచారం గురించి పోలీసులకు వివరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులకోసం గాలిస్తున్నారు. -
మహిళపై అత్యాచారం కేసులో నిందితులు అరెస్ట్
మహారాష్ట్రలోని వాజేశ్వరీ జిల్లాలో అకొలి గ్రామానికి చెందిన గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులలో నలుగురుని అరెస్ట్ చేసినట్లు జిల్లా పోలీసులు బుధవారం థానేలో వెల్లడించారు. సాగర్ హదల్, సంజయ్ అర్నాడే మోహన్ కథక్, జగదీష్ గవిద్లుగా గుర్తించినట్లు చెప్పారు. ఐదో నిందితుడు వినోద్ కుమార్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదన్నారు. అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలను మమ్మరం చేసినట్లు వివరించారు. నిందితుల్లో ముగ్గురుది బాధితురాలి స్వగ్రామమే అని, మరో ఇద్దరు నిందితలది పక్క గ్రామమని పోలీసులు వివరించారు. అత్యాచారానికి గురైన గిరిజన మహిళ సోమవారం సాయంత్రం ఒంటరిగా వెళ్తుంది. ఆ సమయంలో ఐదుగురు వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెను కత్తితో బెదిరించి నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లారు. అనంతరం ఆమెపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం జరిపారు. దాంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా నిందితలను 48 గంటల్లో అరెస్ట్ చేశారు.