
గిరిజన యువతిని కాటేసిన మానవ మృగాలు
చిత్తూరు: కామాంధుల ఘాతుకాలకు అంతు లేకుండా పోతోంది. కీచక సంతతి అకృత్యాలకు పుణ్యధరిత్రిలో అబల జీవితాలు బలైతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై ఘోరాలు కొనసాగుతూనే ఉన్నాయి. అబలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయి. మృగాళ్ల పశువాంఛకు పడతుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి.
చిత్తూరు జిల్లాలో గిరిజన యువతిపై నాలుగు మానవ మృగాలు సామూహిక మానభంగానికి తెగబడ్డాయి. పలమనేరు మండలం గూతలబండలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.