
ప్రేమ వివాహం.. కాపురం చేసి గెంటేశాడు!
► న్యాయం కోసం మౌనదీక్షకు దిగిన భార్య
విజయనగరం: ప్రేమించి పెళ్లి చేసుకొని నాలుగు నెలలు కాపురం చేసిన తర్వాత ముఖం చాటేసిన భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటానికి దిగింది. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం గౌరిపురం గ్రామానికి చెందిన చల్ల శంకర్ రావు, కాకి సుదీపను ఈ ఏడాది మార్చిలో పెద్దల సమక్షంలో ప్రేమపెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో వివాదాలు తలెత్తాయి.
ఇంటి కోడలు సుదీపను అత్తవారింటి నుంచి మెడపట్టుకొని గెంటేశారు. ఎంతగానో వేడుకున్నా భర్త ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో మనోవేదనకు గురైన సుదీప తనకు న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు మౌన దీక్షకు దిగింది. తన భర్తకు మరో పెళ్లి చేయడానికి యత్నిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఆమె మౌన దీక్షకు మహిళా సంఘాలు తమ మద్దతు తెలిపాయి.