=కొత్త సంవత్సర వేడుకలకు రెడీ
=ఏర్పాట్లు చేసుకుంటున్న యువత
=మద్యం, మాంసం, కేకులకు డిమాండ్
=సంబరాల ఖర్చు రూ.6 కోట్లకు పైనే
కామారెడ్డి, న్యూస్‌లైన్: మంగళవారం రాత్రి 12 గంటలకు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కేకులు తయారు చేయిస్తున్నారు. నిజామాబాద్ నగరం, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాలలోనూ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. ఏడాదికేడాది కొత్త సంవత్సరం సంబరాల ప్రాధాన్యం పెరుగుతుండడంతో ఈ సారి పెద్ద ఎత్తున మద్యం, మాంసం విక్రయాలు జరుగవచ్చని భావిస్తున్నారు. ముందుగానే స్నేహితులంతా కలిసి డబ్బును జమ చేసుకుని ఏయే కార్యక్రమాలు చేసుకోవాలో నిర్ణయించుకుని దానికనుగుణంగా రెడీ అయిపోతారు.
వేడుకల ఖర్చు రూ. 6 కోట్ల పైనే
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసుకునే విందులు, వినోదాలకు జిల్లావ్యాప్తం గా దాదాపు ఐదు కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచ నా. జిల్లాలో 4.50 లక్షల కుటుంబాలు ఉండగా, అందులో సగం మంది వేడుకలను జరుపుకుంటారు. వారు పెట్టే ఖర్చు అడ్డగోలుగా ఉంటోంది. ఒక్కరోజే రూ.మూడు కోట్లకు పైగా మద్యం అమ్మకాలు సాగుతాయని తెలుస్తోంది. మద్యం వ్యాపారులు ఇప్పటికే మ ద్యం తెప్పించి నిల్వ చేశారు. మాంసానికి రూ. రెండు కోట్ల వరకు ఖర్చు చేస్తారని అంచనా. కేకులకు, ఇతరవాటికి కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంటారు. ఇది కోటి రూపాయలకు పైగా ఉంటుందని భావిస్తున్నారు.
కామారెడ్డి టు హైదరాబాద్
కొత్త సంవత్సర వేడుకలను మరింత కలర్‌ఫుల్‌గా జరుపుకోవాలనుకునే వారు హైదరాబాద్ కు తరలివెళుతుంటారు. ఏటా కామారెడ్డి ప్రాం తానికి చెందిన వందలాది మంది క్లబ్బులు, పబ్‌లలలో ఎంజాయ్ చేసేందుకు హైదరాబాద్ వెళ్తారు. మరికొందరు పేకాటతో రాత్రంతా ఎంజాయ్ చేస్తారు. కొత్త సంవత్సరానికి స్వా గతం పల కడం ఏమోగాని విందులు, వినోదాలతో సంప్రదాయాలు మరిచిపోతున్నారని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
మస్త్ రాత్రికి హంగామా
Published Tue, Dec 31 2013 6:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
Advertisement