ఏసీబీ వలలో రికార్డ్ అసిస్టెంట్
ఏలూరు (వన్‌టౌన్) :జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చేతివాటం ప్రదర్శించిన మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ పచ్చిపాల కృష్ణను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నిడమర్రు మండలం తీగలపల్లి గ్రామానికి చెందిన బయ్యే రత్నకుమార్ తల్లి దీవెనమ్మ అనారోగ్యంతో గత నెల 21న మృతి చెందింది. ఆమెకు ఎల్‌ఐసీ పాలసీ ఉంది. పాలసీ మొత్తాన్ని తీసుకోవడానికి ఆమెకు వైద్యం చేసినట్టుగా ధ్రువీకరణ పత్రం దాఖ లు చేయాలని ఎల్‌ఐసీ అధికారులు రత్నకుమార్‌ను కోరా రు. దీంతో అతడు ఆ పత్రం కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో తన తల్లికి వైద్యం చేసిన డాక్టర్ ప్రవీణ్‌కుమార్ వద్దకు వెళ్లాడు. తాను అన్ని సంతకాలూ చేసానని, ఆ పత్రాలు రికార్డ్ అసిస్టెంట్ నుంచి తీసుకోవాలని వైద్యుడు సూచించారు.
రత్నకుమార్ రికార్డ్ అసిస్టెంట్ కృష్ణను కలిశాడు. అందుకు రూ.3 వేలు ఇవ్వాలని రికార్డ్ అసిస్టెంట్ కృష్ణ డిమాండ్ డంతో కనీసం రూ.1,500 ఇవ్వాలని అడిగాడు. దీంతో రత్నకుమార్ ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు మంగళవారం రికార్డ్ అసిస్టెంట్ కృష్ణ రూ.1,500 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టకున్నారు. కృష్ణ స్వగ్రామం చింతలపూడి. ఏసీబీ దాడి వ్యవహారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం రేపింది. ఈ దాడులలో ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ, సీఐ యూజే విల్సన్ పాల్గొన్నారు.