వార్షికోత్సవంలో వైద్య విద్యార్థినులు
అనంతపురం న్యూసిటీ: వైద్య వృత్తిలో నైతిక విలువలు పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అపోలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీధర్ అన్నారు. అనంతపురం వైద్య కళాశాల వార్షికోత్సవం శనివారం కనుల పండువగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శ్రీధర్‌తో పాటు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కెఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. అనంతరం డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా రాణించాలన్నారు. డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. ఆ తర్వాత గోల్డ్ మెడల్స్ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జయచంద్రారెడ్డి, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషాదేవి, ఆర్‌ఎంఓ డాక్టర్ లలిత, డాక్టర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బంగారు కొండ ‘జాహ్నవి’
వైద్య కళాశాల 2కే12 బ్యాచ్‌కు చెందిన ఎం.జాహ్నవి ఆరు బంగారు పతకాలు సాధించి టాపర్‌గా నిలిచింది. ఈమె స్వస్థలం హైదరాబాద్. తండ్రి సుమంత్, తల్లి అరుణాదేవి. వీరిద్దరూ ఆయుర్వేద వైద్యులు. తల్లిదండ్రుల స్ఫూర్తితోనే వైద్య వృత్తిని ఎంచుకున్నానని, బెస్ట్ సర్జన్‌గా ప్రజలకు సేవలందించడమే ధ్యేయంగా ముందుకెళ్తానని జాహ్నవి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment